చేపల వాసన పోవాలంటే.. ఇలా చేయండి..

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (15:23 IST)
పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాంబ్రాణి పొగ వేయడం సహజం. ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలు సాంబ్రాణి పొగతో దూరమవుతాయి. సాంబ్రాణితో ఇల్లంతా మంచి సువాసనను సంతరించుకుంటుంది. కర్పూరాన్ని కూడా ఇలాంటి ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 
 
కర్పూరాన్ని వెలిగిస్తే సువాసన కాసేపు మాత్రమే ఉంటుంది. కానీ అలా చేయకుండా ఆరు కర్పూరం బిళ్లలను తీసుకుని అందులో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదా స్నానాల గదిలో ఉంచి చూడండి. ఫలితం మీకే కనబడుతుంది. వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు కూడా దరిచేరవు. ఇంకా నిమ్మ, లావెండర్‌, దాల్చిన చెక్క నూనెలు బయట అమ్ముతారు. 
 
ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతోపాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. వీటిలో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు, ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. అలాగే రంధ్రాలున్న చిన్న గిన్నె తీసుకుని అందులో కొన్ని కాఫీ గింజల్ని నింపి మూత పెట్టాలి.
 
ఈ గిన్నెను వంటింట్లో ఓ మూలన ఉంచాలి. కాఫీ గింజలు ఇతర దుర్వాసనల్ని పీల్చుకుని వాటి వాసనల్ని వెదజల్లుతుంటాయి. మసాలా వాసన, చేపల వాసన పోవాలంటే, స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూస్తే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments