Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజ్ విత్ ఎగ్ పలావ్ ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 20 జూన్ 2015 (15:44 IST)
కూరగాయలు, కోడిగుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్‌లో ఈ వీకెండ్ వెజిటబుల్-ఎగ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
ఉల్లి, బీన్స్, క్యారెట్, ఆలూ, క్యాప్సికమ్ తరుగు- అర కప్పు చొప్పున 
కోడిగుడ్లు - ఐదు 
బాస్మతి రైస్ - మూడు కప్పులు 
అల్లం గుజ్జు- ఒక టీ స్పూన్ 
బిర్యానీ ఆకు - ఒకటి
పసుపు- చిటికెడు 
గరం మసాలా- అర టీ స్పూన్ 
నెయ్యి, ఉప్పు - సరిపడా 
 
తయారీ విధానం : 
ముందుగా నెయ్యి వేడిచేసి బిర్యానీ ఆకు, యాలక్కాయ, లవంగాలు, అల్లం గుజ్జు, పచ్చిమిర్చి తరుగు, కూరగాయలు ముక్కలు వేయాలి. ఇవి కొంచెం ఉడికాక బియ్యం వేసి మరికాసేపు వేగించాలి. తర్వాత మసాలా పొడి, పసుపు వేసి మళ్లీ కాసేపు ఉంచాక ఒకటిన్నర కప్పుల కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి, ఉప్పు వేసి ఉడికించాలి. 
 
ఉడికించిన గుడ్ల పెంకు తీసి గుడ్లని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మరోపాన్‌లో కొంచెం నెయ్యి వేడిచేసి కొద్దిగా ఉప్పు, మిరియాలు, పసుపు వేసి కొంచెం సేపు వేగించాలి. దీన్ని ఉడికించిన పులావ్ అన్నంలో కలిపి వేడివేడిగా కడాయ్ చికెన్‌తో సర్వ్ చేయాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments