Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమ్మర్ స్పెషల్ : డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టే జింజర్, కుకుంబర్ జ్యూస్!

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2016 (10:24 IST)
బయట ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడికి శరీరంలో నీరంత చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. దాంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. దాంతో పాటు, చర్మ సమస్యలు, వడదెబ్బ, డయేరియా వంటి సమస్యలు అధికం అవుతాయి. వీటి బారీ నుండి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే వేసవిలో చల్లచల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. 
 
వేసవిలో శరీరంలో నీటిని బ్యాలెన్స్ చేయడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. వేసవికి జింజర్, కుకుంబర్ జ్యూస్ ఫర్ ఫెక్ట్ సమ్మర్ డ్రింక్‌గా పనిచేస్తుంది. మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అల్లం అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. మరి ఈ రెండింటిని ఉపయోగించి జ్యూస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం...
 
కావల్సిన పదార్థాలు:
కీరదోసకాయ: 1 తరిగినది
అల్లం: కొద్దిగా 
పంచదార: 1 స్పూన్
జీలకర్ర పొడి: తగినంత
బ్లాక్ సాల్ట్: చిటికెడు
 
తయారుచేయు విధానం:
ముందుగా అల్లం మరియు కీరదోసకాయకు పొట్టు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ను ఒక పెద్ద బౌల్లో వేసి అవసరం అయినన్ని నీళ్ళుపోసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమంలో బ్లాక్ సాల్ట్, పంచదార మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే జ్యూస్ గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాన్నితీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments