స్పానిష్ స్పెషల్ ఐస్‌క్రీమ్ తయారీ ఎలా?

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (11:33 IST)
కావలసిన పదార్థాలు :
పాలు... పావు లీటర్
దాల్చిన చెక్క... పెద్దది ఒకటి
నిమ్మచెక్క... ఒకటి
చక్కెర... 300 గ్రాములు
కోడిగ్రుడ్లు... నాలుగు
ఉప్పు... కొద్దిగా
క్రీమ్... అర లీటర్
 
తయారీ విధానం :
ఒక పాత్రలోకి... పాలు, దాల్చిన చెక్క, నిమ్మచెక్క (వట్టి రసం మాత్రమే కాకుండా చెక్క మొత్తాన్ని వేసేయాలి), చక్కెర తీసుకుని కలిపి స్టౌ మీద పెట్టాలి. పాలు బాగా మరిగిన తర్వాత దించేసి, పావు గంట సేపు చల్లారబెట్టాలి. కోడిగుడ్డు సొనలో కొద్దిగా ఉప్పు వేసి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమం ఉన్న గిన్నెను చల్లటి నీళ్లు ఉన్న గిన్నెలో ఉంచితే కాసేపటికి సొన చిక్కబడుతుంది. పాలల్లోంచి దాల్చిన చెక్క, నిమ్మచెక్కలను తీసేసి కోడిగుడ్ల సొనను వేసి బాగా కలియబెట్టాలి.
 
తర్వాత ఈ మిశ్రమాన్ని స్టౌ పై ఉంచి, సన్నటి మంట మీద స్పూనుతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి స్పూనుకు అంటుతున్నప్పుడు దించేసుకుని క్రీమ్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిగా అయిన తర్వాత తీసి మిక్సీలో రుబ్బుకోవాలి. మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఇలాచేయటం వల్ల ఐస్‌క్రీమ్ మెత్తగా, మృదువుగా తయారవుతుంది. ప్రీజర్‌లోంచి తీసి రుబ్బి, మళ్లీ ప్రీజర్‌లో పెట్టి మళ్లీ రుబ్బి... ఇలా రెండు లేదా మూడుసార్లు చేసిన తర్వాత, చివర్లో కప్పులలో పోసి డీప్‌లో పెట్టాలి. అంతే స్పానిష్ స్పెషల్ ఐస్‌క్రీమ్ రెడీ అయినట్లే..! 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగం పెరుగు ప్యాకెట్లో చచ్చిన ఎలుక, షాక్ తిన్న కొనుగోలు చేసిన వ్యక్తి, వీడియో

ఒకప్పుడు ట్రోలింగ్‌లో నేనే నెం.2.. కాన్ఫిడెన్స్‌లో నెం.1: నారా లోకేష్ (video)

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, సిరి దంపతులకు మగబిడ్డ పుట్టాడోచ్

Samantha: సమంత, రాజ్ దంపతులకు సారె పెట్టిన చిరంజీవి, సురేఖ దంపతులు

సంగీతతో సర్దుకుపోనున్న విజయ్: అందుకే త్రిష దూరం అవుతుందా?

Sai durga Tej : పాతకాలపు రొటీన్ కథలను స్వస్తి చెప్పానంటున్న సాయి దుర్గా తేజ్

Sukumar: ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణా నేపథ్యంలో సుకుమార్ చిత్రం

Show comments