Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2015 (15:45 IST)
హెల్దీ అండ్ టేస్టీ మష్రూమ్ అండ్ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మష్రూమ్‌తో డయాబెటిస్‌ను దూరం చేసుకోవడంతో పాటు ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. అలాగే క్యాప్సికమ్‌ తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. ఇక ఈ రెండింటి కాంబినేషన్‌లో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
మష్రూమ్స్ - రెండు కప్పులు 
క్యాప్సికమ్ - రెండు కప్పులు 
జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ - ఒక కప్పు  
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు 
పచ్చి మిర్చి తరుగు - ఒక స్పూన్ 
బటర్ - పావు కప్పు 
ఉప్పు - తగినంత 
కొత్తిమీర తరుగు - అరకప్పు 
నిమ్మరసం- నాలుగు స్పూన్లు  
బాస్మతి రైస్ - మూడు కప్పులు 
 
తయారీ విధానం :  
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో అల్లం పేస్ట్, ఉల్లి, మిర్చి తరుగు వేసి రెండు నిమిషాల పాటు వేపాలి. తర్వాత బటర్ చేర్చి కాస్త వేడయ్యాక మష్రూమ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేపుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్‌ను చేర్చి కాసింత పెప్పర్ చేర్చుకోవాలి.

టమోటా కెచప్, సోయా సాస్ వుంటే చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక మంట తగ్గించి రైస్‌కు మసాలా బాగా పట్టేంత వరకు మెల్లగా కలుపుతూ.. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, నిమ్మరసం చేరి వేడి వేడిగా కడాయ్ చికెన్, బటర్ చికెన్‌తో సర్వ్ చేస్తే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

Show comments