మిక్స్డ్ ఫ్రూట్ ఫుడ్డింగ్ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (16:34 IST)
పండ్లలో చాలా పోషకాలున్నాయి. ఫ్రూట్ మిక్స్‌‌తో చాలా వెరైటీలు చేయొచ్చు. క్యాన్సర్‌ను నిరోధించి, వ్యాధినిరోధక శక్తిని పెంచే పండ్లతో మిక్స్డ్ ఫ్రూట్ ఫుడ్డింగ్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేశారా. పిల్లలు తెగ ఇష్టపడి తినే ఈ ఫ్రూట్ పుడ్డింగ్‌ చాలా టేస్టీనే కాదు.. హెల్తీ కూడా. వివిధ రకాల పండ్లతో పోషకాలతో ఫ్రూట్ పుడ్డింగ్‌ను చాలా డిఫరెంట్‌గా తయారుచేసుకోవచ్చు. అదేలాగో ట్రై చేసి చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
పాలు : అర లీటర్
కోడి గుడ్లు : రెండు 
కస్టర్డ్ పౌడర్ : రెండు టేబుల్ స్పూన్లు 
బిస్కెట్స్ : నాలుగు 
పంచదార పొడి : అర కప్పు 
రెడ్ జెల్లీ : ఒక కప్పు 
గ్రీన్ జెల్లీ : ఒక కప్పు 
స్ట్రాబెర్రీ : నాలుగు 
బ్లూ బెర్రీ : ఆరు 
పీచ్ : ఆరు
మామిడి: 1
సీడ్ లెస్ లీచీ: రెండు 
మాపుల్ సిరప్ : ½ cup 
 
తయారీ విధానం :
ముందుగా పెద్ద గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్, బిస్కెట్స్ గిలకొట్టి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని పోయాలి. తర్వాత పాలు బాగా మరిగాక అందులో పంచదార మిక్స్ వేసి కలపాలి. తర్వాత ఓ పెద్ద గ్లాస్ బౌల్ తీసుకుని అందులో చిక్కగా ఉడికించుకున్న పాల మిశ్రమాన్ని కొద్దిగా ఓ లేయర్‌గా పోయాలి.  
 
తర్వాత దాని మీద రెడ్ జెల్లీ, మరో లేయర్ గ్రీన్ జెల్లీ పోయాలి. తర్వాత ఫ్రూట్స్ కూడా సర్దాలి. తర్వాత తిరిగి మరో లేయర్ చిక్కటి పాల మిశ్రమాన్ని పోయాలి. ఇలా పదార్థాలన్ని పూర్తయ్యే వరకూ అన్నింటిని లేయర్స్‌గా పోసుకోవాలి. ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక ఈ గ్లాస్ బౌల్‌ను ఫ్రిజ్ లో పెట్టి కనీసం 2 గంటలు ఉంచాలి. అంతే పుడ్డింగ్ రెడీ అవుతుంది. 
 
రెండు గంటల తర్వాత బయటకు తీసి గ్లాస్ బౌల్ ను రివర్స్ లో పెట్టి, పుడ్డింగ్‌ను ప్లేట్ లోకి వంపుకోవాలి. తర్వాత దాని మీద మాప్లే సిరఫ్‌ను పోయాలి. అంతే చివరగా మిక్స్డ్ ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి డిన్నర్‌కు చల్లచల్లగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

భార్య మంటల్లో కాలిపోతుంటే వీడియో తీసిన శాడిస్ట్ భర్త అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ

Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్‌లో అమీర్ లోగ్ సాంగ్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

Show comments