Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనీస్ వంటకం ఛీజ్ మైదా టార్టిల్లాస్ తయారీ ఎలా?

Webdunia
సోమవారం, 9 జూన్ 2014 (12:37 IST)
కావలసిన పదార్థాలు :
ఛీజ్... పావు కేజీ
ఉల్లిపాయలు... మూడు
టొమోటోలు... మూడు
క్యాప్సికం... రెండు
మైదా... 350 గ్రాములు
ఉప్పు... తగినంత
కొత్తిమీర... రెండు కట్టలు
 
తయారీ విధానం :
ముందుగా మైదాపిండిలో కాస్తంత ఉప్పువేసి నీటితో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టొమోటోలు, క్యాప్సికంలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొత్తిమీరను కూడా తురిమి ఉంచాలి. ఫ్రెష్ ఛీజ్ అయినట్లయితే.. తొందరగా కరుగుతుంది, లేనట్లయితే దాన్ని సన్నగా తురిమి రెండు భాగాలుగా చేసి ఒక బాగాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులలో నింపాలి.
 
రెండో భాగాన్ని సీజనింగ్ కోసం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మైదాను నాలుగు భాగాలుగా చేసి మందంగా రొట్టెల్లాగా వత్తుకోవాలి. వాటిపైన ఉల్లిపాయ, టమోటో, క్యాప్సికం ముక్కలతో పాటు ఛీజ్ కూడా వేసి సన్నటి మంటపైన కాల్చాలి. అదే ఓవెన్లో అయితే, మూడు నిమిషాల పాటు తక్కువ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేస్తే సరిపోతుంది.
 
తరువాత... కప్పులో నింపిన ఛీజ్‌లో కొత్తిమీరను చల్లి, ఇందాక ఉడికించుకున్న మందపాటి రొట్టెలతో సర్వ్ చేయాలి. అన్నట్టు ఛీజ్‌లో డిప్ చేసుకుని వీటిని తింటుంటే భలే రుచిగా ఉంటాయి సుమండీ... ఇంకేముంది వేడి వేడిగా వెరైటీగా ఉండే ఈ ఛీజ్ మైదా టార్టిల్లాస్‌ను ఓ పట్టు పట్టండి మరి..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

Show comments