పోషకాహారం కూరగాయల నూడిల్స్ సూప్

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (15:14 IST)
కావలసిన పదార్థాలు : 
బీన్స్ ముక్కలు - పావు కప్పు,
క్యారట్ ముక్కలు - పావు కప్పు
నూడిల్స్ - అర కప్పు
ఉల్లికాడల తరుగు - 4 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - టీస్పూను,
మిరియాలపొడి - పావు టీస్పూను
చిల్లీసాస్ - టీ స్పూను,
సోయాసాస్ - పావు టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా
 
వెజిటబుల్స్ - నూడిల్స్ సూప్ తయారి : బీన్స్, క్యారట్ ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. తగినంత నీరు పోసి నూడిల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, ఉడికించిన బీన్స్, క్యారట్ ముక్కలు వేసి వేయించాక, తర్వాత కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాల పొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీ సాస్ వేసి మరిగించాలి. మరిగాక నూడిల్స్ కూడా చేర్చి కొద్ది సేపు ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే నూడిల్స్ సూప్ రెడీ. దీనిని సాయంత్రం వేళల్లో చిన్నారులకు ఇవ్వడం చాలా మంచిది, ఆరోగ్యకరం. దీనిని చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

Show comments