Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బేబీ హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 2 జులై 2014 (15:28 IST)
మీ బేబీ హాయిగా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ముందుగా సమయపాలన ఉండాలి. పిల్లలు నిర్ణీత సమయం ప్రకారం నిద్రపోయేలా చూసుకోవాలి. పిల్లలకు రాత్రిపూట త్వరగా నిద్రించేలా అలవాటు చేయాలి. నిద్రకు సంబంధించిన వరస సంఘటనలను పిల్లల మదిలో నిక్షిప్తం చేయగలిగితే, రెండు, మూడు వారాల్లో కొత్త రొటీన్‌‌కు అలవాటుపడతారు.
 
ఇంకా ఎలాంటి టిప్స్ పాటించాలంటే.. రాత్రిపూట ఏడింటికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం, స్నానం చేసేప్పుడు నీళ్ల మీద తేలే బొమ్మలను ఆడుకోవడానికి ఇవ్వడం. రంగురంగుల బొమ్మలు ప్రింట్‌ చేసిన నైట్‌ డ్రస్‌ను తొడగడం. మంచి సుగంధ భరితమైన పౌడర్‌ను రాయడం, నిద్రకు ముందు మంచి కథను చెప్పడం, వీలైతే మంచి సంగీతాన్ని వినిపించడం. ఇవన్నీ పిల్లలు ఇష్టపడే అంశాలు. వీటిని రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే కొన్ని రోజులకు పిల్లల్లో ఈ విధానం సహజనిద్రను ప్రేరేపిస్తుంది. 
 
మీ బేబీ నిద్రించేటప్పుడు మీరు కూడా తనతో పాటే అక్కడే ఉండాలని భావిస్తున్నట్లైతే పాప నిద్రపోయే వరకూ మీరూ అక్కడే ఉండాలి. నిద్రకు ఉపక్రమించిన పావుగంట తరువాత దుప్పటి సవరించడం వంటివి చేయవచ్చు. ఒకవేళ పాప ఏడిస్తే చూడనట్లు ఉండాలి తప్పితే ఎక్కువ ఆతృత కనపరచకూడదు. 
 
పిల్లలు ఏడ్చినప్పుడు తల్లితండ్రులు అతిగా స్పందిస్తే, ఏడవడం ద్వారా దేనినైనా సాధించుకోవచ్చు ననే భావన పిల్లల్లో పెరిగిపోయి చీటికీమాటికీ ఏడుస్తారు. లైటు వెలుతురు వలన మీకు నిద్ర రాకపోతే పిల్లలకు కూడా రాదనుకోకూడదు. నిజానికి లైట్లు ఉంటేనే చాలామంది పిల్లలు ధైర్యంగా నిద్రపోతారు.
 
అలాగే పై కప్పు మీద మెరిసే నక్షత్రాలను అతికించడం, గోడల మీద ఆసక్తి కలిగించే పోస్టర్లను అతికించడం వంటివి చేస్తే పిల్లలు వాటిని చూస్తూ నిద్రలోకి జారుకుంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments