పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలి?

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (18:20 IST)
పిల్లలకు నచ్చే రోజ్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలుసా? పాలలోని పోషకాలు పిల్లల పెరుగుదలకు తోడ్పడుతాయి. క్యాల్షియం అందించే పాలతో మిల్క్ షేక్ చేయాలంటే... 
 
కావల్సిన పదార్థాలు: 
పాలు: మూడు కప్పులు 
వెనీల ఐస్ క్రీమ్: 3 బిగ్ స్కూప్స్
సిరఫ్ కోసం: 
పంచదార: 200 గ్రాములు 
నీళ్ళు: మూడు గ్లాసులు 
రోజ్ మిల్క్ ఎసెన్స్: రెండు టేబుల్ స్పూన్స్ 
 
తయారీ విధానం : 
ముందుగా ఓ పాత్రలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి. నీటిని మీడియం మంటపై బాగా మరిగించాలి. ఇందులో పంచదార చేర్చి, కరిగిపోయాక రోజ్ మిల్క్ ఎసెన్స్‌ను జోడించి బాగా మిక్స్ చేయాలి. స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్‌లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
 
బ్లెండర్‌లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. పిల్లలు ఇష్టపడి తాగుతారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. ఎమ్మెల్యేలకు పీకే సూచన

జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)

మహా పాపం నిజం.. తిరుపతి లడ్డూ వివాదం.. వైకాపా, జగనే టార్గెట్‌గా ఫ్లెక్సీలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

Show comments