Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు బిస్కెట్లు ఇస్తున్నారా? అదీ క్రీమ్ బిస్కెట్లా.. వామ్మో డేంజర్! (video)

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (17:58 IST)
Cream biscuits
పిల్లలు బిస్కెట్లు అధికంగా తీసుకుంటున్నారా? అయితే డేంజరే అంటున్నారు వైద్యులు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అలాంటిది బిస్కెట్లను రెండుకు మించి ఒకే సమయంలో ఎక్కువ తీసుకుంటే ఆకలి లేమి ఏర్పడుతుంది. తద్వారా ఇతర ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు ఆసక్తి చూపరు. సాధారణంగా బిస్కెట్లతో పోల్చితే క్రీమ్ బిస్కెట్లు ఇంకా ప్రమాదకరం. 
 
క్రీమ్ బిస్కెట్లలో చేర్చే ఫ్లేవర్లు, రంగుల్లో పూర్తిగా రసాయనాలు వుంటాయి. అందులో రుచి కోసం సుక్రోస్ అధికంగా వుండటం, తెలుపు పంచదారను చేర్చడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ క్రీమ్ బిస్కెట్లు తీసుకోవడం ద్వారా వయో బేధం లేకుండా అందరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ బిస్కెట్లను తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు పెరిగిపోతాయి. ఉప్పు చేర్చే బిస్కెట్లలో సోడియం కార్బొనేట్ రక్తపోటును పెంచుతుంది. రోజూ క్రీమ్ బిస్కెట్లు, ఉప్పు చేర్చే బిస్కెట్లను తీసుకుంటే పిల్లల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.
 
ఇంకా బిస్కెట్లను మైదా పిండితో తయారు చేయడం ద్వారా, పిల్లల్లో మలబద్ధం తప్పదు. గ్లాసుడు పాలతో రెండు బిస్కెట్లను పిల్లలు తీసుకుంటే శరీరంలో అనవసరపు కొవ్వు చేరుతుంది. పిల్లలు చురుకుగా వుండరు. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. కొన్ని బిస్కెట్ ప్యాకెట్లలో షుగర్ ఫ్రీగా వుంటాయి. ఇందులో సుక్రోస్ లేకపోయినా.. దానికి బదులు షుగర్ ఫ్రీ మాత్రలను, కార్న్ పిండి, షుగర్ సిరప్‌లను చేర్చుతారు. ఇవి శరీర మెటబాలిజం స్థాయిలను తగ్గిస్తాయి. కాలేయంలో సమస్యలను పెంచుతాయి. 
 
అందుచేత పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని, ఇంట్లో తయారు చేసే స్నాక్స్‌ను ఇవ్వడం మంచిది. పెరిగే పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడాన్ని తల్లిదండ్రులు అలవాటు చేయకపోవడం మంచిదని పీడియాట్రిస్టులు సెలవిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments