పిల్లల నిద్రపై శ్రద్ధ పెట్టండి.. నిద్రవేళకు అరగంట ముందే అన్నీ ఆపేయాలి!

పిల్లల నిద్రపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, నిద్ర ఇవి రెండే పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుచేత సరైన టైమ్‌లో పిల్లలకు ఆహారం ఇవ్వడం.. తద్వారా శరీరానికి పోషకాలు అందిం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:04 IST)
పిల్లల నిద్రపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, నిద్ర ఇవి రెండే పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుచేత సరైన టైమ్‌లో పిల్లలకు ఆహారం ఇవ్వడం.. తద్వారా శరీరానికి పోషకాలు అందించడం చేయాలి. ఇక నిద్ర విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. సరైన టైమ్‌కు నిద్రపుచ్చి.. సమయానికి లేపాలి. శరీర పెరుగుదల, మెదడు వికసించటం రెండూ దాదాపు నిద్ర ద్వారానే జరుగుతాయి. పిల్లల్లో 4-8 ఏళ్ల పిల్లలు 11 గంటల పాటు నిద్రపోవాలి. 8-10 ఏళ్ళ వయసు పిల్లలు పది గంటల పాటు నిద్రపోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లల్ని సమయానికి నిద్రపుచ్చండి. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి. సెలవుల్లో పిల్లలు నిద్ర వేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవటానికి కనీసం వారం రోజులు ముందు నుండి నిద్ర వేళల్ని సరిచేయాలి.
 
ఇక పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్రవేళకు అరగంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయటం నిలిపేయాలి. సాయంత్రాలలో, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయంకాలం తరువాత చాక్లెట్లు కోలా డ్రింకులు తాగనీయవద్దు. వీటిలో ఉండే కీఫిన్ రోజువారీ నిద్రను చెడ గొడుతుంది. పడుకునే మందు రిలాక్స్ కావటాన్ని పిల్లలు నేర్పించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అర్థరాత్రి 3 ప్యాకెట్ల ఎలుకల మందు ఆర్డర్: ప్రాణాలు కాపాడిన బ్లింకిట్ బోయ్

బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లు.. చంద్రబాబు ఆ ఒత్తిడికి తలొగ్గితే.. కూటమికి కష్టమే?

మగాళ్లు కూడా వీధి కుక్కల్లాంటివారు.. ఎపుడు అత్యాచారం - హత్య చేస్తారో తెలియదు : నటి రమ్య

ఏం దేశం వెళ్లిపోదాం? ఆలోచిస్తున్న ఇరాన్ ప్రజలు, ఎందుకు?

తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

Havish: రాజాసాబ్ థియేటర్లలో హవిష్ చిత్రం నేను రెడీ ఎక్స్‌క్లూజివ్ టీజర్ ప్రదర్శన

Yash: టాక్సిక్ టీజర్ లో శ‌శ్మానంలో గ‌న్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్

తర్వాతి కథనం
Show comments