Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆరోగ్యంపై రకరకాల పుకార్లు.. 40 మంది నెటిజన్లపై కేసులు... చెన్నై పోలీసుల వార్నింగ్

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. ''అమ్మ'' ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆ

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:32 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యంపై మళ్లీ వదంతులు రావడం కలకలం రేపుతోంది. ''అమ్మ'' ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడు మంత్రులు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకుంటుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 
 
అయితే తాజాగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి రాజ్‌భవన్ నుండి ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదలైన సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్ ఛైర్మన్‌తో జయలలిత ఆరోగ్యం గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, చికిత్స అందిస్తున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ… డాక్టర్లను అభినందించారని, అలాగే జయలలితను పరామర్శించి, పండ్లు ఇచ్చి త్వరగా కోలుకోవాలని చెప్పినట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే జయలలిత ఆరోగ్యంపై వదంతులు పుట్టించిన 40 మందిపై చెన్నై నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. వదంతులు పుట్టించిన వారిమీద కఠిన చర్యలు తీసుకోంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. జయలలిత ఆరోగ్యం విషయంలో అవాంచనీయ ఘటనలు చోటుచేసుకునేలా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా కొందరు అసత్య ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 
 
మొత్తం 40 ఫిర్యాదులు చేశారని, 40 మంది మీద కేసు నమోదు చేశామని చెన్నైనగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ మీడియాతో వెల్లడించారు. సోషల్ మీడియా సర్వర్ అమెరికాలో ఉన్నందున నిందితులను గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుందని అన్నారు. అమ్మ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడానికి కారణం అయిన వారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టమని చెన్నై నగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ చెప్పారు. ఇప్పటికే కొందరి చిరునామాలు గుర్తించామని ఆయన అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments