Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన మళయాళ సింగర్ షాన్... కారణం ఏమిటి?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (13:48 IST)
మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన సంగీత గాయని షాన్ జాన్సన్ చెన్నైలో ఒక ప్రముఖ హోటల్‌లో హఠాత్తుగా మరణించింది. ఆమె ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు, కీర్తి శేషులు జాన్సర్ మాస్టర్ కూతురు. చెన్నై సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... గురువారం సాంగ్ రికార్డింగ్ తర్వాత షాన్ జాన్సన్ తిరిగి హోటల్‌కి చేరుకున్నారు. 
 
శుక్రవారం ఆమె రికార్డింగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె బసచేసిన హోటల్‌లోనే మరణించడం మిస్టరీగా ఉంది. ఇటీవల మలయాళ సినిమా పరిశ్రమ నుండి షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చి హోటల్‌‌లో మరణించిన సీనియర్ నటి కల్పన మృతి మరిచిపోకముందే తాజాగా షాన్ జాన్సన్ మరణించడంతో మలయాళ చిత్ర సీమ ద్రిగ్భాంతి చెందింది.
 
షాన్ జాన్సర్ తండ్రి, ప్రముఖ మళయాల సంగీత దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ జాన్సర్ మాస్టర్ ఆగస్టు 2011లో మరణించారు. తర్వాత 2012లో ఆమె యొక్క సోదరుడు రెన్ జాన్సన్‌ను రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇద్దరు మరణించాక షాన్ జాన్సన్ తన తల్లి రాణి జాన్సన్‌తో కలిసి ఉంటున్నారు. కాని షాన్ జాన్సన్ కూడా మరణించడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోయారు.
 
అయితే షాన్ జాన్సన్ మరణానికి గల కారణాలు ఏమిటో ఇంకా తెలియలేదు. అయితే నిద్రలో గుండెపోటు రావడంతో మరణించినట్లు అనుమానిస్తున్నారు. షాన్ అనుమానాస్పదంగా చనిపోయి ఉండడంతో పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు మృతదేహాన్నిపోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత షాన్ జాన్సన్ మృతదేహాన్ని ఆమె సొంతూరు త్రిస్సూర్‌కు తీసుకెళ్లనున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments