Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్‌పై వెళుతున్న ప్రేమికులను వీడియో తీశారు. అప్‌లోడ్ చేశారు. ఇదే సంస్కృతి పరిరక్షణో?

సమాజంలో స్త్రీపురుషుల సంబంధాలను పవిత్రంగా భావిస్తూ సంస్కృతిని కాపాడుతున్నామనుకుంటూ సంస్కృతీ పరిరక్షకులుగా భావిస్తున్న మోరల్ పోలీసులు తాము పట్టుకున్న ప్రేమికులను వీడియో తీసి దానిని ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రపంచానికంతటికీ చూపించే వికృత ప్రవర్తన ఏ సంస్కృతీ

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (04:23 IST)
అమ్మాయిల ఆకాంక్షలకు చందమామ కథ వంటి మనోహర రూపాన్ని అందించిన ఫిదా  సినిమా చూసి ప్రేక్షకులు మైమర్చిపోతున్నారు. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి బైక్‌పై వెళుతున్నా చూసి సహించలేని ఆదిమ పైశాచికత్వం ఈ కాలంలో కూడా రాజ్యమేలుతూనే ఉంది. సమాజంలో స్త్రీపురుషుల సంబంధాలను పవిత్రంగా భావిస్తూ సంస్కృతిని కాపాడుతున్నామనుకుంటూ సంస్కృతీ పరిరక్షకులుగా భావిస్తున్న మోరల్ పోలీసులు తాము పట్టుకున్న ప్రేమికులను వీడియో తీసి దానిని ఫేస్‌బుక్‌లో పెట్టి ప్రపంచానికంతటికీ చూపించే వికృత ప్రవర్తన ఏ సంస్కృతీ పరిరక్షణలో భాగమో చెప్పగలరా.. సమాజ నైతికతను కాపాడుతున్నామనుకుంటున్న ప్రబుద్ధులు ఒక అమ్మాయి పరువును వైరల్ చేస్తున్న ప్రవర్తన ఏ ఆదిమ భావజాలానికి సంబంధించినదో గుర్తించగలరా?
 
బైక్‌పై వెళుతోన్న ప్రేమికులను అడ్డగించి, వారిని కులం పేరుతో దూషించి, బెదిరింపులకు పాల్పడిన ‘మోరల్‌ పోలింగ్‌ వీడియో’ ఒకటి తమిళనాడులో సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ఫేస్‌బుక్‌ సంస్థ సదరు వీడియోను తొలగించింది.
 
పెరంబలూరుకు చెందిన వేలుమురుగన్‌ కోలంగినాథ్‌ అనే యువకుడి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి వీడియో పోస్ట్‌ అయింది. అందులో.. తమను అడ్డుకున్న యువకుల బృందాన్ని ప్రేమజంట బతిమాలుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. తాము ప్రేమికులమని, కేవలం మాట్లాడుకోవడానికే వచ్చామని వివరించారు. ‘ప్లీజ్‌.. ఈ అమ్మాయి భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వీడియో తీయకండి..’ అని వేడుకున్నా ముష్కర బృందం వినిపించుకోలేదు. కులం పేరుతో తీవ్రంగా దూషించి, బెదిరించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.
 
రంగంలోకి దిగిన పోలీసులు.. వేల్‌మురుగన్‌ అడ్రస్‌ను కనిపెట్టి ఇంటికి వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న అతను ఊరు విడిచి పారిపోయాడు. నిందితుడి బంధువుల ద్వారా అతని ఆచూకీ కనిపెడతామని, నలుగురైదుగురు కలిసి ఈ దుశ్యర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీడియోలో కనిపించిన మరో బైక్‌ ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాగా, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బహుశా పెరంబలూరు సమీప గ్రామంలో ఇది జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
ఘనకార్యం చేశానని సంబరపడిన అతగాడు పోలీసులను చూసి పారిపోవడం ఇదీ కూడా చట్టాన్ని గౌరవించే సంస్కృతిలో భాగమేనా?
సంస్కృతీ పరిరక్షణ అనే భావననే అపహాస్యం చేస్తున్న ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టపడేదెన్నడు?
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments