మోదీ చెప్పారనే గౌరవంతో విలీన చర్చలు.. కాని అంతా నాటకం అంటున్న పన్నీర్

అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలూ విలీనం అయితే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆకాంక్షించినప్పటికీ శశికళ శిబిరంలో నాటకాలు రక్తి కట్టడంతో ఆయన ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యాని

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (03:06 IST)
అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలూ విలీనం అయితే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆకాంక్షించినప్పటికీ  శశికళ శిబిరంలో నాటకాలు రక్తి కట్టడంతో ఆయన ఆకాంక్షను నెరవేర్చలేకపోయామని అన్నాడిఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానించారు.  అన్నాడిఎంకే అమ్మతో ఇక, విలీనం ప్రసక్తే లేదని  రెండు రోజులక్రితం ప్రకటించిన పన్నీరు సెల్వం విలీనం విషయంలో తాను ఎందుకు వెనక్కు తగ్గాల్సి వచ్చిందో మీడియాకు సవివరంగా చెప్పారు. 
 
తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ముక్కలైన పార్టీ వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. మళ్లీ అందరూ ఏకం కావాలని, ఒకే వేదికగా అన్నాడిఎంకే ముందుకు సాగాలని, అవినీతి రహిత పాలన సాగాలంటే, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మోదీ సూచించారని వివరించారు. అవినీతి అన్నది బయట పడ్డ పక్షంలో ప్రభుత్వం పని పడుతానన్న హెచ్చరికను సైతం ఆయన చేశారని పేర్కొన్నారు. అన్నాడిఎంకే ఒకే వేదికగా సాగాలని మోదీ ఆశ పడ్డారని, అందుకే ఢిల్లీ నుంచి రాగానే విలీనం నినాదాన్ని తొలుత తానే అందుకున్నట్టు గుర్తు చేశారు.
 
విలీన నినాదంతో ప్రయత్నాలు సాగిన సమయంలో అమ్మ శిబిరంలో నాటకాలు రక్తికట్టాయని ఆరోపించారు. ప్రధానంగా తనను మోసం చేయడం, ఒంటరిని చేయడం, తన పేరుకు కళంకం తీసుకు రావడం లక్ష్యంగా ఆ నాటకాల్ని ఎంత అద్భుంతంగా అంటే, అంతగా...రక్తి కట్టించారని మండి పడ్డారు. విలీనానికి తాను మొగ్గు చూపినా, ఈ నాటకాలతో అస్సలు విషయాన్ని గ్రహించి వెనక్కు తగ్గక తప్పలేదని స్పష్టంచేశారు. శశికళ, దినకరన్‌ చెప్పినట్టుగానే పళని స్వామిలు నాటకాలు రచించారన్నది తన దృష్టికి వచ్చిందన్నారు. 
 
దినకరన్‌ నాటకం నమ్మకాన్ని కల్గించ లేదని, పళని తృప్తి పరచలేదని ఎద్దేవా చేస్తూ, అందుకే విలీనంకు ముగింపు పలుకుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అన్నాడిఎంకే ముక్కులైనా కేడర్‌ చెల్లా చెదరు కాలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన వైపు కింది స్థాయి కేడర్, ద్వితీయ శ్రేణి వర్గాలతో పాటుగా ప్రజలు ఉన్నారని, వారి వైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధుల బలం ఉందని వ్యాఖ్యానించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? జబ్ ఖులి కితాబ్ ZEE5లో స్ట్రీమింగ్

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments