Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీ బాత్రూమ్‌లో విద్యార్థిని ప్రసవం.. యూట్యూబ్‌ వీడియో చూసి బొడ్డు కత్తిరింపు

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:45 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. స్థానక ప్రభుత్వ మహిళా కాలేజీ మరుగుదొడ్డిలో ఓ విద్యార్థిని ప్రసవించింది. యూట్యూబ్‌లో చూసి బొడ్డు కత్తిరించింది. ఆ తర్వాత పసికందును చెత్తబుట్టలోపడేసి, ఏమీ తెలియనట్టుగా తరగతి గదిలో వచ్చి కూర్చొంది. అయితే, క్లాస్ రూమ్‌లో ఆ విద్యార్థికి రక్తస్రావం కావడంతో ఈ విషయం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో 4 వేల మందికిపైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఇదిలావుండగా 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడింది. శుక్రవారం తరగతి గదిలో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే మరుగుదొడ్డికి వెళ్లి ఆడ శిశువుని ప్రసవించింది. అనంతరం యూట్యూబ్‌ వీడియో చూసి బొడ్డుకోసింది.
 
అనంతరం బిడ్డను కళాశాలలోని చెత్త కుండీలో పడేసి చెత్తతో కప్పేసింది. తర్వాత ఏం జరగనట్లు వెళ్లి తరగతి గదిలో కూర్చుంది. రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు అధ్యాపకులకు తెలిపారు. దీంతో వారు 108 అంబులెన్స్‌ని పిలిపించి కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్యులు ఆమెను విచారించి మళ్లీ కళాశాలకు అంబులెన్స్‌ను పంపి శిశువును తీసుకొచ్చేలా చేశారు. బిడ్డకు వెంటనే చికిత్స అందించి బతికించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఘటనపై నాచ్చియార్‌ కోయిల్‌ మహిళా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments