ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న తమిళ నటుడు విశాల్!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (10:49 IST)
తెలుగు మూలాలు ఉన్న తమిళ హీరో విశాల్. ఆయనకు రాజకీయాలకు ఎంతో సంబంధం ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వశక్తులా పోరాటం చేశారు. 
 
నామినేషన్ కూడా వేశాడు. అయితే నామినేషన్‌ను ప్రతిపాదించిన వారిలో కొంత మంది తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్‌ విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ ఉపఎన్నికల్లో విశాల్‌ పోటీ చేయలేకపోయాడు. ఓ వర్గం ఆయన్ను అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 
 
ఈ క్రమంలో మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కిడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. యువ హీరో విశాల్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. 
 
ఇప్పటికే, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపోందిన విశాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతున్నాడట. చెన్నై నగర పరిధిలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరిపాడట. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా బరిలోకి దిగాలని విశాల్ ప్లాన్ చేస్తున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments