Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీన్ పదవి కోసం నగ్నపూజ.. భార్యను కూడా ఆ పూజలో..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (16:04 IST)
డీన్ పదవి కోసం తను నగ్నపూజ చేయటమే కాకుండా భార్యను కూడా అలాగే పూజలో పాల్గొనాలంటూ వేధిస్తున్న ఓ ప్రొఫెసర్‌ గుట్టు బయటపడింది. ధర్మపురిలోని ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సెల్వరాజ్‌ మొదటి భార్య మరణించడంతో సేలం జిల్లా కడయాంబట్టికి చెందిన కార్తీక అనే వితంతువును రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగింది. 
 
ఆ తర్వాతే ఆమెకు వింత పరిస్థితులు ఎదురయ్యాయి.  అదేంటంటే ఓ రోజు రాత్రి సెల్వరాజ్‌ నగ్నంగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండటాన్ని చూసి అవాక్కయ్యింది. అదేమిటని అడిగితే కళాశాల డీన్ పదవి కోసం నగ్నపూజ చేస్తున్నానని చెప్పాడట. తొలుత భర్త నిర్వాకాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఓ రోజు తానొక్కడినే నగ్నపూజ చేయడం వల్ల బోరు కొడుతోందని, తనతోపాటు ఆమె కూడా నగ్నంగా పూజలో పాల్గొనాలని వేధించడం మొదలు పెట్టాడు. 
 
తాను ఇటువంటి పూజలు చేయనని చెప్పినకూడా పట్టించుకోలేదట. ఆ వేధింపులు భరించలేని కార్తీక తరచూ పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కానీ, ఇటీవల ఆమెను పిలిచిన సెల్వరాజ్‌, తనతో కలిసి నగ్న పూజ చేయాల్సిందేనని, లేకుంటే విడాకులిస్తానని బెదిరించాడు. 
 
దీంతో ఆమె పుట్టింటి వారితో తిరిగొచ్చి భర్తను మార్చే ప్రయత్నం చేసింది. దీంతో కోపం చెందిన సెల్వరాజ్‌ ఆమెను గురువారం రాత్రి కుటుంబీకుల సమక్షంలోనే చితకబాదాడు. గాయపడిన కార్తీక చికిత్స కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడే కార్తీక తన భర్త వేధింపులను బయట పెట్టింది.

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?