Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలిద్దరూ ఒకే రాశికి చెందినవారైతే?

Webdunia
గురువారం, 29 మే 2014 (11:48 IST)
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దంపతులిద్దరు వేర్వేరు రాశులకు చెందినవారై ఉండటం శ్రేయస్కరమని నిపుణులు చెపుతున్నారు. అలాగాకుండా భార్యాభర్తలిద్దరూ ఒకేరాశిలో జన్మించిన జాతకులైతే.. గ్రహస్థితులు సక్రమంగా లేని సమయంలో అంటే అష్టమ శని, ఏలినాటి శని ఆధిపత్యంతో విభేదాలకు దారితీసే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
ఇదేవిధంగా.. ఒకేరాశికి చెందిన భార్యాభర్తల మధ్య.. రాహుకేతు దశాకాలంలో "అహం" అనే భూతంతో పలు సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే ఒకే రాశికి చెందిన దంపతులకు వ్యక్తిత్వ మనస్తత్వం, భావాలు సరితూగడంతో కొన్ని సమస్యలు దూరమవుతాయి. కానీ భార్యాభర్తలు వారానికి ఒకసారైనా వివాదానికి దిగుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 
ఇలా భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్నచిన్న వివాదాలు పెనుప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, అందుచేత ఒకేరాశికి చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవడం కూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఒకవేళ ఒకేరాశిలో పుట్టిన స్త్రీ, పురుషులు దంపతులై ఉంటే.. గ్రహస్థితి సరిగ్గా లేని సమయంలో జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
అంతేగాకుండా..  ఒకేరాశిలో జన్మించిన దంపతులు అష్టమశని, ఏలినాటి శని సమయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం, శనివారం పూట నువ్వులనూనెతో దీపమెలిగించడం వంటివి చేస్తే సమస్యలు దరి చేరవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

Show comments