Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నెలలో మీ రాశి ఫలితాలేంటి? ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుందా?

జూలై నెలలో 7వ తేదీ శుక్రుడు, 11వ తేదీ బుధుడు కర్కాటకము నందు, 12వ తేదీ కుజుడు వృశ్చికమునందు, 16వ తేదీ రవి కర్కాటకం నందు, 27వ తేదీన బుధుడు సింహం నందు, 31వ తేదీన శుక్రుడు సింహం నందు ప్రవేశం.

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (16:40 IST)
జూలై నెలలో 7వ తేదీ శుక్రుడు, 11వ తేదీ బుధుడు కర్కాటకము నందు, 12వ తేదీ కుజుడు వృశ్చికమునందు, 16వ తేదీ రవి కర్కాటకం నందు, 27వ తేదీన బుధుడు సింహం నందు, 31వ తేదీన శుక్రుడు సింహం నందు ప్రవేశం. 
 
1వ తేదీ కూర్మజయంతి, 2వ తేదీ శనిత్రయోదశి, 3వ తేదీ మాస శివరాత్రి, 9వ తేదీ స్కందపంచమి, 10వ తేదీ కూమరషష్టి, 13వ తేదీ శుక్రమౌఢ్యమి, 15వ తేదీ తొలి ఏకాదశి, 19వ తేదీ గురుపూర్ణిమ, 23వ తేదీ సంకటహరచతుర్థి, 30వతేదీ మతత్రయ ఏకాదశి, 31వ తేదీ నుంచి గోదావరి నదీ అంత్య పుష్కరాలు ప్రారంభం.
 
మేషం... అశ్వని, భరణి, కృతిక 1 వపాదం 
ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలమే. అనుకోకుండా అదృష్టం తలుపు తడుతుంది. సంతోషకరమైన విషయం వింటారు. కృషి, ఫలిస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ప్రతి విషయంలో ఓర్పుగా వ్యవహరించండి. మీలో సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు మంచి గుర్తింపు వస్తుంది. పాత వ్యక్తుల కలయిక మీకెంతో సంతృప్తినివ్వగలదు. వినోద యాత్రల్లో సరదాగా గడుపుతారు. ప్రైవేట్ సంస్థల్లో వారికి మార్పులు అనుకూలించవచ్చు. నమ్ముకున్న వ్యవసాయం కాని, వ్యాపారం కాని పురోభివృద్ధినిస్తాయి. ఆరోగ్యం అగమ్యగోచరంగా ఉంటుంది. దానధర్మాలు చేయటం వల్ల మంచి పేరు ఖ్యాతి లభిస్తుంది. నలుపు వర్ణాలు కలిగిన దుస్తులు ధరించడం వల్ల కించిత్ ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్తలు వహించండి. ప్రయాణం అనుకూలిస్తుంది.
 
వృషభం... కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త పథకాలు రూపొందిస్తారు. దుబారా ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అయినవారు ఆదుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆలోచనలు కొలికివస్తాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆరోగ్యం సంతృప్తికరం. వాహన యోగం, వస్తులాభం, ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
మిథునం... మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1,2,3 పాదాలు 
లక్ష్యా సాధనకు పట్టుదల ముఖ్యం. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు లాభిస్తాయి. వ్యాపారాలు  క్రమక్రమంగా పుంజుకుంటాయి. కుటుంబీకుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఉదాసీనంగా వ్యవహరించం వల్ల సమస్యలు అధికమవుతాయి. తాత్కాలికంగా తక్కువగా ఉన్నందువల్ల ఒత్తిడి చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రైవేట్ రంగాల్లో వారికి ధనార్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవితంలో ఊహించని మలుపు మీకెంతో ఆనందాన్నిఇస్తుంది. రుణం ఏకొంతైనా తీరుస్తారు. ఎవరిపై ఆధారపడకుండా యత్నాలు మీరు చేయండి. సేవా కార్యక్రమాల్లో ఏకాగ్రత వహిస్తారు. కోర్టు వాయిదాలు, ఆస్థి వివాదాలు కొలిక్కివస్తాయి. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం... పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష 
ఈ మాసం శుభదాయకమే. రుణ, కుటుంబ, ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలిస్తుంది. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. అవివాహితులలో ఉత్సాహం నెలకొంటుంది. ఆహ్వానాలు పత్రాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో  ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు కలిసివచ్చే సమయం. అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. ఉపాధి పథకాలు అనుకూలిస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి ఆశాజనకం. క్రీడాకారులకు నిరుత్సాహం తప్పదు.
 
సింహం... మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదిస్తారు. సర్దుబాటు ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. అవసరానికి అతి కష్టం మీద ధనం అందుతుంది. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు కొత్త ప్రదేశ సందర్శనలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలి. మహాశివరాత్రి నాడు పంచామృతాలతో మహాకాళేశ్వరుని ఆరాధన శుభం, క్షేమం.
 
కన్య... ఉత్తర 2,3,4 పాదాలు హస్త, చిత్త 1,2 పాదాలు 
ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఉన్నతిని చాటుకునేందుకు బాగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖిరిలో మార్పు వస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి. ఎవరికీ హామీలివ్వవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. విద్యార్థుల్లో ఏకాగ్రత నెలకొంటుంది. దస్త్రం వేడుకలు ముహూర్తం నిశ్చయించుకుంటారు. నాగమల్లేరు పూలతో నీలకంఠుడిని ఆరాధన శుభదాయకం.
 
తుల... చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు 
ఈ మాసం శుభదాయకమే, శుభకార్యయత్నం ఫలిస్తుంది. కళ్యాణ మంటపాలు అన్వేషిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనుకున్నలక్ష్యాలు సాధిస్తారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రుణ విముక్తులవుతారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. గృహనిర్మాణం చేపడుతారు. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహాకరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు కలిసివచ్చే సమయం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాలు అనుకూలిస్తాయి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఎగుమతి, దిగుమతి రంగాలవారికి ఆశాజనకం. క్రీడాకారులకు నిరుత్సాహం తప్పదు. మహాశివరాత్రి నాడు అవిశెపూలతో మృత్యుంజయుని ఆరాధన కలిసిరాగలదు.
 
వృశ్చికం... విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో విభేదిస్తారు. సర్దుబాటు ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. అవసరానికి అతికష్టం మీద ధనం అందుతుంది. ఆప్తుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశ సందర్శనలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలి. మహాశివరాత్రి కొండగోగుపూలతో రుద్రుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 
 
ధనస్సు... మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు అధికం. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వృత్తుల వారికి సామాన్యం. నిరుద్యోగులకు ప్రకటనలు, దళారుల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల పదోన్నతి యత్నం ఫలించకపోవచ్చు. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం సంభవం. దళారులను విశ్వసించవద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మహాశివరాత్రి శిరీష పూలతో వైద్యనాథుని ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. 
 
మకరం... ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు 
ఈ మాసం ప్రధమార్థం అనుకూలం. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలు, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయ వ్యయాలకు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన లోపం చికాకులు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యవహార ఒప్పందాలలో ఏకాగ్రత వహించండి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. వ్యాపారులు ఆశాజనకంగా సాగుతాయి. నష్టాలు ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలీయవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి, ఆకస్మిక స్థానచలనం సంభవం. విద్యార్థులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. సంకల్పసిద్ధికి మహాశివరాత్రి నాడు నూపూలతో భీమేశ్వరుని ఆరాధన.
 
కుంభం... ధనిష్ట 3,4వ పాదాలు,  శతభిషం, పూర్వభాద్ర 1,2,3 పాదాలు 
అన్నిరంగాల వారికి ఆశాజనకమే. గృహంలో సందడి నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. శుభకార్య యత్నంఫలిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు పెరిగినా ధనానికి లోటుండదు. చెల్లింపులు, చెక్కులు జారీలో జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ సహాయంతో ఒకరికి సదవాకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులు, సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తులవారికి ఆదాయభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఎగుమతి, దిగుమతి రంగాలవారికి ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలకు అనుమతులు, వనరులు సర్దుబాటవుతాయి.
 
మీనం... పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఉన్నత పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవం పలుకుబడి పెంపొందుతాయి. మొహమాటాలు, పొగడ్తలుకు లొంగిపోవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వాయిదాపడిన మొక్కులు తీర్చుకుంటారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలన ఉత్తర్వులు అందుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలు, పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారాలకు ఆశాజనకం. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం క్షేమం కాదు. విందులు వినోదాల్లో మితంగా ఉండాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

మంగళవారం సంకష్ట హర చతుర్థి.. కుజదోషాలు మటాష్

18-11-2024 సోమవారం ఫలితాలు - ఆ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది...

17-11-2024 ఆదివారం ఫలితాలు - ఆ రాశివారు అప్రమత్తంగా ఉండాలి...

17-11-2024 నుంచి 23-11-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments