Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత రిజర్వు బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాలు!

Webdunia
గురువారం, 31 జులై 2014 (19:04 IST)
భారత రిజర్వు బ్యాంకులో (ఆర్.బి.ఐ)లో మొత్తం 506 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్.బి.ఐ కార్యాలయాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆర్.బి.ఐ హైదరాబాద్ బ్రాంచ్‌లో 36 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇందులో ఎస్సీలకు 7, ఎస్టీలకు 2, ఓబీసీలకు 9, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై ఒకటో తేదీ నాటికి 18 నుంచి 28 యేళ్లు మధ్య ఉండాలి. అంటే 1986 జూలై 2 నుంచి 1996 జూలై 1వ తేదీలోపు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 
 
విద్యార్హత కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణులో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులైతే చాలు. రాత పరీక్ష 200 మార్కుల్లో ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగాల్లో 40 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, కంచికచర్ల, చీరాల, ఏలూరు, గుడ్లవల్లేరు తదితర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు ఆరో తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షా ఫీజును ఆన్‌లైన్‌లో 6వ తేదీలోపు, బ్యాంక్ బ్రాంచీల్లో ఆగస్టు 11వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను చూడొచ్చు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments