Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూజీసీ నెట్ పరీక్షలు వాయిదా.. పరీక్షలకు 15 రోజులకు ముందే..?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (20:04 IST)
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్‌) చేయడానికి అర్హత కోసం నిర్వహించే యూజీసీ.. నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్‌(నెట్‌) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అధికారికంగా ప్రకటించింది. 
 
వాస్తవానికి ఈ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్‌లోనే జరగాలి. కానీ గత ఏడాదిగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజ్ అయింది. మే 2 నుంచి మే 17 వరకు జరగాల్సిన యూజీసీ నెట్ ఎగ్జామ్ గతేడాది డిసెంబర్ సెషన్‌కు సంబంధించినది. 
 
మరోవైపు ఈ ఏడాది జూన్ సెషన్ ఎగ్జామ్ కూడా నిర్వహించాల్సి ఉంటుంది.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2020 డిసెంబర్ సెషన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ జూన్‌లో జరిగే అవకాశముంది. దీంతో 2021 జూన్ సెషన్ పరీక్ష కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
 
అయితే మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామన్న సంగతి ఎన్‌టీఏ వెల్లడించలేదు. పరీక్షలకు 15 రోజుల ముందే కొత్త తేదీలపై సమాచారం ఇస్తామని ప్రకటించింది. కాగా, ప్రస్తుత కొవిడ్ ఉధృతి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకునే యూజీసీ నెట్ డిసెంబర్ 2020 షెడ్యూల్‌ను (మే 2021)ను వాయిదా వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments