Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు శుభవార్త - చేరిన వర్శిటీ నుంచే...

Webdunia
సోమవారం, 30 మే 2022 (15:23 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు మంచి శుభవార్త ఒకటి చెప్పింది. చేరిన యూనివర్శిటీ నుంచే తమకు నచ్చిన యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకునిరానుంది. 
 
సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్శిటీలో చేరితే సౌకర్యాలు సరిగా లేకున్నా, ఏ ఇతర ఇబ్బందులు ఎదురైనా కోర్సు పూర్తయ్యేంత వరకు అక్కడే చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఒక వర్శిటీలో చేరితో మరో యూనివర్శిటీలో చేరే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించనుంది. 
 
ఈ విధానం యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మాసివ్ ఓపెన్ ఆన్‍‌లైన్ కోర్స్, స్వయం వేదికలను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఉదాహరణకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం కోర్సుల్లో ఒక విద్యార్థి చేరితో ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్, బోధనా సిబ్బంది లేకపోతే ఆ కోర్సు ఢిల్లీ యూనివర్శిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ హానర్స్, హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments