నిర్మాన్‌తో క్వాలిజీల్ డిజిటల్ యాక్సెస్ సీఎస్ఆర్ కార్యక్రమం

ఐవీఆర్
గురువారం, 8 మే 2025 (20:33 IST)
ఏఐ -ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ అగ్రగామి అయిన క్వాలిజీల్, నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ఒక ముఖ్యమైన సీఎస్ఆర్ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించినట్లు నేడు వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, క్వాలిజీల్ హైదరాబాద్‌లోని పేద యువతకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసింది, ఇది సమ్మిళిత అభివృద్ధి, డిజిటల్ సాధికారత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించింది.
 
ఈ కార్యక్రమం రెండు సంస్థల సీనియర్ నాయకత్వం సమక్షంలో జరిగింది. వెనుకబడిన సమాజాల్లోని వ్యక్తుల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, వారి విద్య, వృత్తిపరమైన ప్రయాణాలను ప్రోత్సహించగల సాంకేతికతకు అవకాశాలను అందించటం ఈ కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమంలో క్వాలిజీల్ సహ వ్యవస్థాపకుడు-భారత కార్యకలాపాల అధిపతి మధుమూర్తి రోణంకి మాట్లాడుతూ, “క్వాలిజీల్‌ వద్ద, సాంకేతికత ఒక అవరోధంగా కాకుండా అనుసంధానంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా, ఉత్సుకతను రేకెత్తించడం, అవకాశాలను అందించడం, ప్రాధమిక  స్థాయి నుండి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను ప్రోత్సహించటం చేయాలని మేము కోరుకుంటున్నాము ” అని అన్నారు.
 
నిర్మాన్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యాల అధిపతి నిఖిల్ గంపా మాట్లాడుతూ, “క్వాలిజీల్‌తో ఈ భాగస్వామ్యం ఒక విరాళం కంటే ఎక్కువ. ఇది యువత సామర్థ్యం పై పెట్టుబడి. మా లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు క్వాలిజీల్‌కు కృతజ్ఞులం” అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments