Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎంలో 20వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌.. 35వేల ఖాళీల భర్తీ

Webdunia
బుధవారం, 28 జులై 2021 (20:52 IST)
పేటీఎం దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం. కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్లాన్‌ చేస్తోంది.
 
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) మే నాటి డేటా ప్రకారం ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉండగా, 45 శాతం మార్కెట్ వాటాతో ఫోన్ పే మొదటి స్థానంలో, గూగుల్ పే 35 శాతం రెండో స్థానంలో ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments