Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ యూజీ పరీక్షకు అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసిన ఎన్టీఏ

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (09:19 IST)
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్.ఈ.ఈ.టి - నీట్) పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ నెల 5వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు ఇటీవల సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. తాజాగా అడ్మిట్‌ కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
నీట్‌ పరీక్షకు ఈసారి 24 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు 557 కేంద్రాల్లో, విదేశాల్లో 14 సిటీల్లో ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లుచేశారు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి విద్యార్థులు తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే 011-40759000 లేదా neet@nta.ac.inకు ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments