Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకింగ్ రంగంలో 25 శాతం ఉద్యోగాలు పెంపు.. పంకజ్ బన్సాల్

Webdunia
ఆదివారం, 24 మే 2015 (13:42 IST)
బ్యాంకింగ్ రంగంలో గత ఏడాదితో పోల్చితే 25 శాతం ఉద్యోగాలు ఈ ఏడాది పెరుగుతాయని పీపుల్ స్ట్రాంగ్ వ్యవస్థాపక సీఈఓ పంకజ్ బన్సాల్ వెల్లడించారు. 2014తో పోలిస్తే నాలుగోవంతు అధికమందికి ఈ సంవత్సరం ఉద్యోగాలు లభించనున్నాయని, కింది స్థాయి ఉద్యోగుల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ నియామకాలు జరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కొత్త బ్యాంకులు ప్రారంభం అవుతుండడంతో, ఉద్యోగుల సంఖ్యా పెరగనుందని వివరించారు. ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో సైతం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. 
 
ఐడీఎఫ్‌సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు బ్యాంకులను ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో కొత్త శాఖలు రానుండడం, వీటి కోసం వేలాది సంఖ్యలో నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో బ్యాంకింగ్ రంగం ఉపాధి కల్పన విషయంలో మిగతా రంగాలతో పోల్చిచూస్తే ముందంజలో ఉందని పంకజ్ బన్సాల్ వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments