Webdunia - Bharat's app for daily news and videos

Install App

2025-2027 బ్యాచ్ కోసం మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌తో ఐఎంటి విద్యా సంవత్సరం ప్రారంభం

ఐవీఆర్
బుధవారం, 18 జూన్ 2025 (22:24 IST)
హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(ఐఎంటి) హైదరాబాద్, అభ్యుదయం 2025 పేరిట మేనేజ్‌మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను 2025-27 బ్యాచ్ కోసం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి  టిసిఎస్ హైదరాబాద్ హెడ్ శ్రీ చల్లా నాగ్, ఎలికో లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ వనితా దట్ల, ఐఎంటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్(డాక్టర్) బహరుల్ ఇస్లాం హాజరయ్యారు.
 
కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన దిశానిర్దేశాన్ని తన ప్రారంభ ఉపన్యాసంలో డాక్టర్ బహరుల్ ఇస్లాం చేశారు. క్రమశిక్షణ ప్రోత్సహించడమే కాకుండా ఆశించబడుతుందన్న ఆయన వృత్తిపరమైన ప్రవర్తన, విద్యా నైపుణ్యానికి పునాది వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు "నేర్చుకోవాలనే ఆసక్తి" ధోరణిని  పెంపొందించుకోవాలని, తమ విద్యా ప్రయాణంలో నిరంతరం అభివృద్ధి చెందేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. "నేర్చుకోవడమనేది తరగతి గదులకే పరిమితం కాదంటూ; అది మనసుకు అలవాటు చేసుకోవాలన్నారు.
 
ప్రస్తుత మేనేజ్మెంట్ విద్య, వాస్తవ పరిస్థితులను గురించి డాక్టర్ వనితా దాట్ల మాట్లాడారు. సంక్లిష్ట ప్రపంచంలో సమాచారం, చురుగ్గా, అనుకూలతను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. సాంకేతికత ఎలా వేగంగా అభివృద్ధి చెందుతుందో చెప్పిన ఆమె మార్పును ముందుగానే స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. ఈ బ్యాచ్‌లో 35% మహిళలు ఉండటం సంతోషంగా ఉందంటూ సమ్మిళిత వృద్ధి యొక్క ప్రాముఖ్యతను, బలమైన సంస్థలు, నాయకులను రూపొందించడంలో వైవిధ్యం యొక్క పాత్రను నొక్కి చెప్పారు.
 
టిసిఎస్ హైదరాబాద్ హెడ్ శ్రీ చల్లా నాగ్ మాట్లాడుతూ సాంకేతికత పరిశ్రమలను ఎలా పునర్నిర్మిస్తుందో తెలిపారు. ఏటీఎంల నుండి మొబైల్ బ్యాంకింగ్ వరకు, ప్రాథమిక ఏఐ అప్లికేషన్ల నుండి ఏజెంటిక్ ఏఐ వరకు- సమగ్రమైన వ్యాపార పరిష్కారాలను అందించే స్వయంప్రతిపత్త ఏఐ ఏజెంట్ల వరకు ఆయన తన ప్రసంగంలో ఉటంకించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. విద్యార్థులు సాంకేతికతను తెలుసుకోవాలని, దానిని ఎక్కడ, ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవాలని కోరారు. "మీరు ఏమి అందించగలరో వాగ్దానం చేయండి, వాగ్దానం చేసిన వాటిని అందించండి" అని విద్యార్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments