నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన కేంద్రం.. 1.30 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (13:15 IST)
దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం శుభవార్త చెప్పింది. దాదాపుగా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది. రక్షణ శాఖలో పని చేయాలని భావించే నిరుద్యోగులు, ఉత్సాహం ఉన్న యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ సీఆర్‌పీఎఫ్ విభాగంలో భర్తీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,29,929 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,25,262 పోస్టులకు పురుషులకు, 4,467 పోస్టులు మహిళలకు కేటాయించారు. దీంతో పాటు మాజీ అగ్నిమీర్ కోసం పది శాతం ఖాళీలను రిజర్వ్ చేశారు. కానిస్టేబుల్ పోస్టులో మాజీ అగ్నివీర్‌లను నియమిస్తారు. 
 
పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులో ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 23 సంవత్సరాల లోపువారై ఉండాలి. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక శారీరక సామర్థ్యం, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. తదుపరి దశల కోసం రాత పరీక్షలో విధిగా ఉత్తీర్ణులై ఉండాలి. శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి పరీక్షలకు అర్హత సాధిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments