Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆమోదం

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (09:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన ఇనాళ్లకి ఉద్యోగాలకు స్థానికత అంశానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. నేడు కొత్త జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆమోదంతో రాష్ట్రంలోని 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 
 
రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్‌ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్‌ కోటా 5 శాతం మాత్రమే ఉంటుంది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
 
వాస్తవానికి 2018లోనే కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చగా.. ఈ మార్పులకు రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో మొత్తం ప్రక్రియకు ఆలస్యమైంది. నేడు రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి రాబోతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్‌ కేటగిరీలోనే ఉన్నాయి.
 
గ్రూప్‌ -1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటానే భర్తిచేస్తారు. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్‌ కోటా కిందే ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments