Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీబీఎస్ఈలో 10, 12వ తరగతుల పరీక్షలు రద్దు

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (17:23 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశం అల్లకల్లోలంగా మారింది. ఇది ప్రతి రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటిలో ఒకటి విద్యా రంగం కూడా ఉంది. ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు చివరకు పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక పరీక్షలను రద్దు చేశాయి. ఈ కోవలోనే సీబీఎస్ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండ్రోజుల్లో వెలువరిస్తామని పేర్కొంది. గత విద్యా సంవత్సరంలో 10, 12 తరగతులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. అయితే కొన్ని సబ్జెక్టులు మాత్రం మిగిలిపోయాయి. ఆ సబ్జెక్టులపై పరీక్షలు పెట్టాలని కొంతమంది కోరగా.. కరోనా నేపథ్యంలో వద్దని మరికొంతమంది సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఒకసారి ఆలోచించాలని కేంద్రప్రభుత్వానికి సూచిందింది. 
 
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దు అవుతున్నాయి. దీంతో సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. నిజానికి, మిగిలిపోయిన పరీక్షలను జులై 1 నుంచి 15 వరకు సీబీఎస్‌ఈ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం భావించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments