Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఈఎల్ రిక్రూట్‌మెంట్‌ 2020-60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ..

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (13:51 IST)
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్‌) మెడికల్ డివైజెస్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ అప్లికేషన్లు ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
 
సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 28ఏళ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
 
మొత్తం ఖాళీలు: 60
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ. విద్యార్హత, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
ఇందులో జరల్-23 పోస్టులు, ఈడబ్ల్యూఎస్-6, ఓబీసీ-17, ఎస్సీ-9, ఎస్టీ-5 చొప్పున పోస్టులు ఉన్నాయి.
 
అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా మెడికల్ ఎలక్ట్రానిక్స్ లేదా మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments