Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీవోబీలో అక్విజేషన్ మేనేజర్ పోస్టులు.. వేతనం రూ.5 లక్షలు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (09:45 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో పలు పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 546 పోస్టులను భర్తీ చేయనుంది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీస్ విభాగంలో ఆక్విజేషన్ మేనేజర్ పోస్టుల 500, ప్రైవేట్ బ్యాంకర్ పోస్టులు 15, వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులు 19 చొప్పున ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు వచ్చే నెల 14వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అక్విజేషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయసు 21 యేళ్గ నుంచి గరిష్టంగా 28 యేళ్లలోపు ఉండాలి. అలాగే, ఇతర పోస్టులకు 24 నుంచి 50 యేళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
అభ్యర్థుల విద్యార్హత.. ఏదేని యూనివర్శిటీ నుంచి కనీసం డిగ్రీ చదివి ఉండాలి. గతంలో యేడాది పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు లేదా ఏవైనా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకయేడాది పాటు పనిచేసిన అనుభవం కలిగివుండాలి. అక్విజేషన్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు మెట్రో నగరాల్లో అయితే రూ.5 లక్షలు, నాన్ మెట్రో నగరాల్లో రూ.4 లక్షలు చొప్పున వేతనం చెల్లిస్తారు. ఇతర అభ్యర్థులకు మాత్రం సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా వేతనాలు ఉంటాయి.
 
దరఖాస్తు ఫీజుగా ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్టీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల కోసం నిర్వహించే రాత పరీక్షా కేంద్రాలను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్టణాల్లో నిర్వహిస్తారు. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూట్, జనరల్ నాలెడ్జ్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున కేటాయిస్తారు. ఈ పరీక్షా తేదీలను తర్వాత వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments