Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెఈఈ మెయిన్స్‌ 2023 మొదటి సెషన్‌లో 99కు పైగా పర్సంటైల్‌ను సాధించిన ఆకాష్‌బైజూస్‌ విద్యార్థులు

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (14:57 IST)
కరీంనగర్‌లోని ఆకాష్‌ బైజూస్‌కు చెందిన ముగ్గురు విద్యార్ధులు 99 పర్సంటైల్‌‌కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2023 పరీక్షల మొదటి సెషన్‌లో సాధించారు. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ సంస్థ నేడు వెల్లడించింది. ఈ సంవత్సరం ఇంజినీరింగ్‌ కోసం నిర్వహించనున్న రెండు ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో ఇది మొదటిది. టాప్‌ స్కోరర్లలో వేముల సిద్ధార్ద్‌ 99.84 పర్సంటైల్‌ సాధించగా, సంకిటి ఐశ్వర్య రెడ్డి 99.64 పర్సంటైల్‌ ను, కార్యాద వరప్రసాద్‌ రెడ్డి 98.60 పర్సంటైల్‌ సాధించిన వారిలో ఉన్నారు.
 
ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావిస్తోన్న ఐఐటీ జెఈఈలో విజయం సాధించేందుకు వీరు ఆకాష్‌ బైజూస్‌ ఇనిస్టిట్యూట్‌లో నాలుగు సంవత్సరాల క్లాస్‌రూమ్‌ ప్రోగ్రామ్‌ కోసం  చేరారు. కాన్సెప్ట్‌లను అర్ధం చేసుకోవడంలో తాము పడిన కష్టం, లెర్నింగ్‌ షెడ్యూల్స్‌కు కట్టుబడి ఉండటమే టాప్‌ పర్సంటైల్‌ సాధించిన ఎలైట్‌ జాబితాలో చోటు సంపాదించుకోవడానికి కారణంగా అభివర్ణించారు. ‘‘ఆకాష్‌ ఇనిస్టిట్యూట్‌కు మేము ధన్యవాదములు చెబుతున్నాము. వారు మాకు అన్ని విధాలుగా సహాయపడ్డారు. కంటెంట్‌, కోచింగ్‌ పరంగా వారి తోడ్పాటు లేకుండా అతి తక్కువ సమయంలో విభిన్న బోధనాంశాలలో మేము ఎన్నో కాన్సెప్ట్‌లను ఒడిసిపట్టలేము ’’అని విద్యార్థులు అన్నారు.
 
విద్యార్థులను అభినందించిన ఆకాష్‌ బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌, శ్రీ ధీరజ్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘‘అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులందరినీ అభినందిస్తున్నాను.  జెఈఈ మెయిన్‌ 2023 కోసం దేశవ్యాప్తంగా8.6 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. స్టేట్‌ టాపర్‌ మరియు పర్సంటైల్‌ టాపర్స్‌గా వారు సాధించిన విజయం, వారు పడిన కష్టం గురించి ఎంతో వెల్లడిస్తుంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలను వారు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
 
జెఈఈ (మెయిన్‌)ను రెండు సెషన్‌లలో నిర్వహించడం ద్వారా విద్యార్ధులు తమ స్కోర్స్‌ మెరుగుపరుచుకునేందుకు పలు అవకాశాలు అందిస్తారు. జెఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐఐటీలు)లో ప్రవేశానికి మాత్రమే నిర్వహిస్తే, జెఈఈ మెయిన్‌ను పలు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌(ఎన్‌ఐటీలు), ఇతర కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తారు. జెఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలంటే తప్పనిసరిగా జెఈఈ మెయిన్‌ రాయాల్సి ఉంటుంది.
 
ఐఐటీ-జెఈఈ కోచింగ్‌ను పలు కోర్సు ఫార్మాట్‌లలో హై స్కూల్‌, హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ విద్యార్థులకు ఆకాష్‌ బైజూస్‌ అందిస్తుంది. ఇటీవలి కాలంలో కంప్యూటర్‌ ఆధారిత శిక్షణను అభివృద్ధి చేయడంపై ఆకాష్‌ అధికంగా దృష్టి సారించింది. దీని ఐట్యుటర్‌ రికార్డెడ్‌ వీడియో లెక్చర్స్‌ అందిస్తుంది. ఇది స్వీయ అభ్యాసంకు తోడ్పడటంతో పాటుగా మిస్‌ అయిన లెక్చర్స్‌ను విద్యార్థులు పొందేందుకు సైతం తోడ్పడుతుంది. మాక్‌ టెస్ట్‌లు వాస్తవ పరీక్షల వాతావరణం ప్రతిబింబించడం వల్ల, పరీక్షలను ఎదుర్కోవడంలో విద్యార్థులకు అవసరమైన విశ్వాసం అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments