Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువర్‌ సేఫ్‌ స్పేస్‌- మీ సురక్షిత ప్రాంగణం- ప్రచారం, మీ భద్రతకు భరోసా

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (18:26 IST)
సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉన్న మహమ్మారి వాతావరణం లాక్‌డౌన్‌ తరువాత వినియోగదారుల సెంటిమెంట్‌ను బలీయంగా మార్చింది. ప్రాధాన్యతలలో మార్పులు మొదలు, కొనుగోలు వేదికలో మార్పు తో పాటుగా వ్యక్తిగత భద్రతకు సంబంధించి నిరంతర భయమూ వెంటాడుతుంది; ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి రోజువారీ ఆలోచనా ధోరణిలో అనివార్యమైన అంశాలుగా మారాయి.
 
ఈ ఆందోళలను ద బాడీ షాప్‌ పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా తమ సిబ్బందితో పాటుగా తమ వినియోగదారులకు సైతం అత్యున్నత భద్రతను అందిస్తూనే కాపాడటాన్ని విశ్వసిస్తుంది. ఈ కారణం చేతనే, అన్ని నివారణా చర్యలనూ దృష్టిలో ఉంచుకుని ద బాడీ షాప్‌ ఇప్పుడు యువర్‌ సేఫ్‌ స్పేస్‌ (మీ సురక్షిత ప్రాంగణం) ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా వినియోగదారులతో పాటుగా స్టోర్‌ సిబ్బంది సైతం సమగ్రమైన మరియు అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాల పట్ల అవగాహన కలిగిఉంటారు.
 
ఈ ప్రమాణాలను బ్రాండ్‌ యొక్క ప్రతి టచ్‌ పాయింట్‌ వద్ద అమలు చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించడం అత్యవసరం, దీనితో పాటుగా ఇతర అవసరమైన పారిశుద్ధ్య ప్రమాణాలను అమలు చేయడంతో పాటుగా మహమ్మారి మన దేశంలో ప్రవేశించిన నాటి నుంచి స్టోర్లు, వేర్‌హౌస్‌లు, ఇతర అన్ని టచ్‌ పాయింట్ల వద్ద ప్రతి కోణంలోనూ బ్రాండ్‌ అత్యున్నత భద్రతా ప్రమాణాలను అమలుచేసేలా చర్యలు తీసుకుంటుంది.
 
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న భయాన్ని పరిశీలిస్తే, సాంకేతికత పరంగా ఎలాంటి అత్యాధునిక ఆవిష్కరణలూ, చెకవుట్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లడానికి ముందు ఓ ఉత్పత్తిని తాకి, అనుభవించి మరియు చర్మంపై అది ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలించుకోవడంతో పోటీపడలేవు. బ్యూటీ కొనుగోలు ప్రక్రియలో ఓ ఉత్పత్తిని పరిశీలించి, ప్రయత్నించిన తరువాతనే ఎల్లప్పుడూ కొనుగోలు చేస్తారన్నది చెప్పనవసరం లేదు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో, మానవులతో ఎలాంటి కాంటాక్ట్‌ అయినా నిరోధించడం లేదా ఇతర ఉపరితలాలను స్పృశించడం నివారించడమన్నది జీవితంలో నూతన లక్ష్యంగా మారింది.దీనిని అతి క్రమించేందుకు అనుసరించాల్సిన ఒకే ఒక్క పద్ధతి నూతన సాధారణతను అనుసరించడం.
 
బాడీషాప్‌ వద్ద, తమ సేఫ్‌ స్పేస్‌ క్యాంపెయిన్‌కు అనుగుణంగా, నూతన సాధారణతలో భాగంగా తప్పనిసరిగా 2 మీటర్ల దూరం తమ అన్ని స్టోర్లలోనూ మరియు వేర్‌హౌస్‌లలోనూ అనుసరించేలా చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా విస్తృతస్థాయి పారిశుద్ధ్యం (ఉత్పత్తులు మరియు ఇతర టచ్‌ పాయింట్లు), సిబ్బందికి ఖచ్చితంగా ఉష్ణోగ్రత పరీక్షలను చేయడంతో పాటుగా వినియోగదారులకు సైతం పరీక్షలు చేయడం, కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. అదనంగా, సిబ్బందికి పూర్తి స్ధాయిలో శిక్షణ అందించడంతో పాటుగా ప్రొటెక్టివ్‌ గేర్‌ మరియు కొలమానాలను సైతం అందించింది. స్టోర్‌ లోపల  స్టోర్‌ బృందాలకు లాగానే వినియోగదారులు మాస్కులను ధరించడం తప్పనిసరి. అంతేకాకుండా వారు స్టోర్‌ లోపలకు అడుగుపెట్టిన వెంటనే వారికి తాజా జత గ్లోవ్స్‌ కూడా అందిస్తారు.
 
ఈ ప్రచార ప్రక్రియను గురించి శ్రీమతి హర్మీత్‌ సింగ్‌, వీపీ, మార్కెటింగ్‌ మర్చండైజింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌ ఆసియా సౌత్‌, ద బాడీ షాప్‌ మాట్లాడుతూ, ‘‘దశల వారీగా మార్కెట్‌లను తెరిచిన వేళ మా స్టోర్లలో వినియోగదారులకు సేవలనందించడాన్ని మించిన ఆనందం మరోటి మాకు లేదు. ద బాడీ షాప్‌ వద్ద, ఈ సమయాన్ని మేము అత్యంత ఖచ్చితత్త్వంతో ఈ దిశగా అడుగు వేయడానికి సిద్ధం కావడంతో పాటుగా దానిని అమలు చేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. మా సేఫ్‌ స్పేస్‌ క్యాంపెయిన్‌, పలు నివారణా చర్యలు, ప్రక్రియలు స్వీకరించడం ద్వారా మా వినియోగదారులు మరియు సిబ్బంది ఈ రోజుకు కూడా సురక్షితంగా ఉన్నామనే భరోసా కల్పిస్తుంది’’ అని అన్నారు.
 
తమ యువర్‌ సేఫ్‌ స్పేస్‌ ప్రచారంలో భాగంగా ద బాడీ షాప్‌ వీలైనంతగా అన్ని భద్రతా చర్యలనూ తీసుకోవడం ద్వారా మీ షాపింగ్‌ అనుభవాలను ఒత్తిడి లేని రీతిలో అందించడంతో పాటుగా నేటి క్లిష్ట పరిస్థితులలో సైతం సురక్షితమైన వాతావరణం ఉందనే భరోసా కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments