Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొమాటోపై డెలివరీ బాయ్స్ ఫైర్-మా చేత గొడ్డు మాంసం, వారిచేత పోర్క్‌ ఏంటిది?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (14:47 IST)
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు వివాదాలు తప్పట్లేదు. ముస్లిం వ్యక్తి చేత ఫుడ్ డెలివరీ చేయిస్తున్నారని ఓ హిందూ వ్యక్తి ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో గతంలో జొమాటో మతం రంగు అంటింది. కానీ జొమాటోకు మతం రంగు పులమొద్దంటూ ఆ సంస్థ తేల్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జొమాటో సంస్థ వార్తల్లో నిలిచింది. 
 
జొమాటోపై పలు ఆరోపణలు చేస్తూ కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్స్ రోడ్డెక్కారు. తమ మనోభావాలకు వ్యతిరేకంగా బీఫ్, పోర్క్ వంటి వంటకాలను సప్లై చేయిస్తున్నారని నిరసనకు దిగారు. జొమాటో మా మనోభావాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని డెలివరీ బాయ్స్ మండిపడుతున్నారు. ఇకనైనా బీఫ్, పోర్క్ డెలివరీ సర్వీస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
జొమాటో మా సెంటిమెంట్స్‌తో ఆడుకుంటోంది. మా చేత అన్నిరకాల ఫుడ్స్ డెలివరీ చేయిస్తోంది. హిందువులమైన మా చేత బీఫ్ డెలివరీ చేయిస్తున్న జొమాటో.. భవిష్యత్‌లో ముస్లిం సోదరుల చేత పోర్క్‌ను కూడా డెలివరీ చేయిస్తుంది. కాబట్టి మతపరమైన విశ్వాసాలతో జొమాటో ఆటలాడవద్దు. అలాగే డెలివరీ బాయ్స్ వేతనాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నామని కోల్‌కతా డెలివరీ బాయ్స్ నిరసనకు దిగారు. 
 
మతపరమైన విశ్వాసాలకు వ్యతిరేకంగా జొమాటో డెలివరీ బాయ్స్‌పై బలవంతంగా ఏదీ రుద్దవద్దని బెంగాల్ ఇరిగేషన్ మంత్రి రాజీవ్ బెనర్జీ చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments