Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోక్స్‌వేగన్‌ ఇండియా విజయవాడలో నూతన టచ్‌ పాయింట్‌ ప్రారంభం

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (22:52 IST)
ఫోక్స్‌వేగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా, దక్కన్‌ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ నూతన సేల్స్‌, సర్వీస్‌ టచ్‌పాయింట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రారంభించింది. శ్రీ రాజేష్‌ పాములపర్తి నేతృత్వంలోని ఈ నూతన సేల్స్‌ అండ్‌ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ఎనికేపాడువద్ద ఎన్‌హెచ్‌5 రోడ్‌లో ఉంది.
 
ఫోక్స్‌వేగన్‌‌తో భద్రతను ఎంచుకోండి: నూతన 3ఎస్‌ (సేల్స్‌, సర్వీస్‌, స్పేర్స్‌) టచ్‌ పాయింట్‌ తాజా, అత్యాధునిక ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను వినియోగదారులకు చేరువ చేయనుంది. భారతదేశంలో అత్యంత సురక్షితమైన ఎస్‌యువీడబ్ల్యుగా ఫోక్స్‌వేగన్‌ టైగున్‌; ఆకట్టుకునే మరియు ఉల్లాసకరమైన వర్టుస్‌ నుంచి అంతర్జాతీయంగా ఫోక్స్‌వేగన్‌కు అత్యధికంగా విక్రయాలు జరిగిన వాహనంగా నిలిచిన టిగున్‌ వరకూ, అత్యున్నత నిర్మాణం మరియు జర్మన్‌ ఇంజినీర్డ్‌ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో విజయవాడలో విస్తృతస్ధాయిలో 8 కార్ల డిస్‌ప్లేను కలిగి ఉంది.
 
ఫోక్స్‌వేగన్‌ ప్యాసెంజర్‌ కార్స్‌ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ శ్రీ అశీష్‌ గుప్తా ఈ నూతన సదుపాయం ప్రారంభం గురించి మాట్లాడుతూ, ‘‘శక్తివంతమైన నిర్మాణం, భద్రత మరియు జర్మనీ తయారీ కార్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో మేము చూస్తున్నాము. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ మరియు వ్యాపార లావాదేవీలు పెరుగుతుండటం దీనికి కారణం. అందువల్ల, మేము మా కార్యకలాపాలు విస్తరించడంతో పాటుగా  ఈ ప్రాంతంలో మా  వినియోగదారుల అవసరాలను సైతం తీర్చనున్నాము. రాష్ట్రంలో 8 సేల్స్‌ మరియు 6 సర్వీస్‌ టచ్‌ పాయింట్ల ద్వారా, ప్రపంచశ్రేణి ఉత్పత్తులు మరియు సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. ఇది మా వినియోగదారుల ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇబ్బందులు లేని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
 
నూతన డీలర్‌షిప్‌ ప్రారంభం గురించి ఫోక్స్‌వేగన్‌ విజయవాడ డీలర్‌ పార్టనర్‌ శ్రీ రాజేష్‌ పాములపర్తి మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఈ నూతన సదుపాయం ప్రారంభించడంతో, ఫోక్స్‌వేగన్‌తో మా అనుబంధం మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉంది. దీనితో పాటుగా ఈ ప్రాంతంలో జర్మన్‌ ఇంజినీర్డ్‌ కార్ల ప్రాప్యతను సైతం వృద్ధి చేస్తున్నాము. ఈ సదుపాయంతో, సురక్షితమైన, ప్రీమియం మొబిలిటీ పరిష్కారాలను ఇంటిగ్రేటెడ్‌ వినియోగదారుల అనుభవాలతో అందించనున్నాము’’ అని అన్నారు.
 
ఫోక్స్‌వేగన్‌ విజయవాడ, బ్రాండ్‌ యొక్క నూతన బ్రాండ్‌ డిజైన్‌ అంశాలను కలిగి ఉంది. ఇది ఈ టచ్‌పాయింట్‌ను మరింతగా అందుబాటులో ఉంచడంతో పాటుగా ప్రస్తుత, సంభావ్య వినియోగదారులకు సౌకర్యవంతమైన అనుభవాలకు భరోసా అందిస్తుంది. ఈ స్టోర్‌లోని 90 మంది ఉద్యోగులు వినియోగదారుల మొబిలిటీ మరియు సేవా అవసరాలను తీర్చగలరు. దీనిలో పెద్దవైన 24 బేస్‌ సదుపాయం ఉంది. ఈ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ మా వినియోగదారుల సేవలు, నిర్వహణ మరియు యాక్సిడెంట్‌ రిపేర్‌ అవసరాలను తీర్చగలదు. సుశిక్షితులైన, నైపుణ్యవంతులైన టెక్నీషియన్లు దీనిని నిర్వహిస్తారు. సర్వీస్‌ షాప్‌కుదూరంగా ఉన్న వినియోగదారులు డోర్‌ టు డోర్‌ సేవల కార్యక్రమం- ఫోక్స్‌వేగన్‌ అసిస్టెన్స్‌ మరియు మొబైల్‌ సర్వీస్‌ యూనిట్‌ సైతం పొందగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments