Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్కర్ కింగ్ హెలికాప్టర్‌ను వేలం-రూ.8.75కోట్లు రికవరీ

లిక్కర్ వ్యాపారి, రూ. 9,000 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా హెలికాప్టర్‌ను వేలం వేశారు. బ్యాంకులకు ఎగనామం బెట్టి బ్రిటన్‌కు పారిపోయి తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చీ

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:38 IST)
లిక్కర్ వ్యాపారి, రూ. 9,000 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా హెలికాప్టర్‌ను వేలం వేశారు. బ్యాంకులకు ఎగనామం బెట్టి బ్రిటన్‌కు పారిపోయి తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్‌ మాల్యా హెలికాప్టర్లను వేలం వేసిన 17 బ్యాంకుల కన్సార్టియం, రూ. 8.75 కోట్లను రికవరీ చేసుకుంది.
 
బెంగళూరులోని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ-1), ఆన్‌లైన్ విధానంలో వేలం వేయగా, రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్‌ కొనుగోలు చేసింది. ఒక్కోటి రూ. 4.37 కోట్ల ధర పలికిందని, చౌదరి ఏవియేషన్‌ డైరెక్టర్‌ సత్యేంద్ర సెహ్రావత్ తెలిపారు. ప్రస్తుతం వీటిని ముంబైలోని జుహు ఎయిర్‌ పోర్ట్‌‌లో పార్క్‌ చేసి ఉంచామని అన్నారు. 
 
2007 నుంచి 2012 మధ్య తమ సంస్థల పేరిట తీసుకున్న రూ. 9 వేల కోట్లకు పైగా రుణాన్ని చెల్లించడంలో విఫలమైన మాల్యా, 2016లో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments