Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ మాల్యా అరెస్టు... జస్ట్ 3 గంటల్లో బెయిల్ మంజూరు.. దటీజ్ లిక్కర్ డాన్ పవర్!

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజర

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (17:27 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరైంది. విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మంగళవారం లండన్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరచగా, ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అదీ అరెస్టు అయిన కేవలం 3 గంటల్లోనే బెయిల్ మంజూరు కావడం గమనార్హం. 
 
భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగవేసిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత్‌ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. అనంతరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. 
 
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9.30 గంటలకు మాల్యాను అరెస్టు చేసినట్లు యూకే పోలీసులు భారత్‌లోని సీబీఐ అధికారులకు సమాచారమందించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఆయనకు 3 గంటల్లోనే వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విజయ్‌మాల్యాను త్వరలోనే భారత్‌ తీసుకొచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments