Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతా అంబానీ తాగే కాఫీ కప్పు ధర రూ.3 లక్షలు... డైనింగ్ టేబుల్ రూ.కోటిన్నర.. ఇంకా...

నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త. భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (16:12 IST)
నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త. భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రిలయన్స్ సహ సారథి కూడా. ఇప్పుడు లేటెస్ట్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్. 
 
కాగా సమాజంలో కొంతమంది లేడీస్ అతి ఖరీదైన జీవనం సాగిస్తుంటే, చాలామంది సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇక నీతా అంబానీ గురించి ప్రస్తావిస్తే ఆమె జీవితశైలిని చూస్తే కుబేరునికి సైతం దిమ్మదిరిగిపోవాల్సిందే. నీతా అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ భార్యగా ఆమె భర్తకు అన్ని రంగాల్లోను చేదోడు వాదోడుగా నిలుస్తుంది. ఆమె రోజు మొత్తం లైఫ్ స్టైల్ చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుందని సమాచారం. 
 
ఆమె లైఫ్ స్టైల్ ఎంత కాస్ట్లీ అంటే ఆమె ప్రతి రోజు ఉదయం తాగే కాఫీ కప్పు ఖరీదు ఏకంగా 3 లక్షల రూపాయలట. నీతా అంబానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ విలువ దాదాపు కోటిన్నర. ఎందుకంటే, బంగారు ప్లాటినం డైమండ్ టేబుల్ వేర్ ఏర్పాటు చేశారట. ఆమె వాడే వాచీలు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీలే. ప్రపంచంలోనే టాప్ వాచీ బ్రాండ్లు అయిన బల్గరీ రాడో గుక్కి కాల్విన్ క్లెయిన్ ఫాజిల్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల వాచీలనే వాడుతారు. 
 
ఆమె హ్యాండ్ బ్యాగ్ గురించి తెలిస్తే ఖంగు తినాల్సిందే. స్నెల్ గోయార్డ్ జిమ్మీ చూ వంటి బ్రాండ్లవే వాడుతారు. వాటిలో ప్రారంభ ధరే 40 లక్షల రూపాయలు ఉంటుందట. ఇక ఆమె వాడే చెప్పుల విషయానికి వస్తే ఆమె ఒకసారి వాడిన చెప్పులు మరోసారి వాడరట. వాటి ధర సుమారు లక్షల పైమాటే.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments