రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర
రైలు ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి. ప్రస్తుతం అమల్లో ఉన్న తత్కాల్ టైమింగ్స్ మారాయి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. తత్కాల్ విధానం కింద టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో మార్పులు చేర్పులు చేశారు.
ఆ ప్రకారంగా, ఏసీ తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ టికెట్ల బుకింగ్ 11 గంటలకు ప్రారంభిస్తారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. రైలు 3 గంటలు అంతకుమించి ఆలస్యమైతే చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరే అవకాశం కల్పించారు.
ఒక మార్గంలో వెళ్లే రైలుకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నాక.. ఆ రైలు రూటును మార్చినా, తాము ఎక్కాల్సిన స్టేషన్ - దిగాల్సిన స్టేషన్ లేదా రెండూ ఆ మార్గంలో లేకపోయినా.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని చార్జీలు పూర్తిగా తిరిగివ్వాలని కోరవచ్చు.
బుక్ చేసుకున్న క్లాసులో కాకుండా దిగువ తరగతి శ్రేణిలో ప్రయాణించాలని రైల్వే వర్గాలు కోరితే.. ఇష్టం లేని ప్రయాణికులు పూర్తి రిఫండ్ కోరవచ్చు. ప్రయాణికులు అందుకు అంగీకరిస్తే.. చార్జీల మధ్య తేడాను ప్రయాణికులకు రైల్వే చెల్లిస్తుంది.