Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మకాన్ని వమ్ము చేసిన విశ్వాస ఘాతకుడు సైరన్ మిస్త్రీ : రతన్ టాటా ఆవేదన

టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సైరన్ మిస్త్రీపై టాటా వారసుడు రతన్ టాటా మాటల దాడికి దిగారు. మిస్త్రీని ఎంతో నమ్మాను.. కానీ ఆయన విశ్వాస ఘాతకుడిగా మారిపోయారని మండిపడ్డారు. ఈ మేరకు తొమ్మిది పేజీల

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (08:49 IST)
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సైరన్ మిస్త్రీపై టాటా వారసుడు రతన్ టాటా మాటల దాడికి దిగారు. మిస్త్రీని ఎంతో నమ్మాను.. కానీ ఆయన విశ్వాస ఘాతకుడిగా మారిపోయారని మండిపడ్డారు. ఈ మేరకు తొమ్మిది పేజీల లేఖస్త్రాన్ని టాటా సన్స్ పేరుతో రతన్ టాటా సంధించారు. 
 
మిస్త్రీని తాము ఎంతో నమ్మి పని అప్పగిస్తే, దెబ్బతీశారని, ఆయన విశ్వాస ఘాతకుడని ఆరోపించారు. ప్రధాన కంపెనీలపై పెత్తనం చెలాయించాలని చూసి, వాటిని తన అధీనంలోకి తీసుకునేందుకు యత్నించారని ఆరోపించారు. స్వతంత్ర డైరెక్టర్లను లోబరచుకుని, వారిని వాడుకున్నారని అన్నారు. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్ వాటా పడిపోయిందని, ఆయన ఛైర్మన్‌గా ఉన్న నాలుగేళ్లలో సంస్థ రుణభారం రూ.69 వేల కోట్ల నుంచి రూ.2.25 లక్షల కోట్లకు పెరిగిందని తన లేఖలో రతన్ టాటా గుర్తు చేశారు.  
 
రోజురోజుకూ పెరుగుతున్న నష్టాన్ని అధిగమించడం ఎలానో తెలియక, దాన్ని రైటాఫ్‌లు చేయడం మొదలు పెట్టారన్నారు. ఇన్నాళ్లూ తమపై మిస్త్రీ బురదజల్లుతూ వచ్చారని, టాటా సన్స్ విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలం కావడం, ఇన్వెస్టర్లకు డివిడెండ్లు తగ్గడం, ఆయనకు సంస్థల నిర్వహణ చేతగాకపోవడం తదితర కారణాల వల్ల తొలగించాల్సి వచ్చిందని రతన్ టాటా వివరించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సమీక్ష

ఇల్లూ వాకిలి తాకట్టుపెట్టి సినిమా తీశాం.. భారీ నష్టాలు చవిచూశాం : రకుల్ ప్రీత్ సింగ్ భర్త

ఓ విషయం మీద బలంగా రియాక్ట్ అవ్వాలని ఉంది... బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments