Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా గ్రూపుతో చేతులు కలిపిన ఫ్లిఫ్ కార్ట్

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:06 IST)
Flipkart
టాటా కన్జ్యూమర్‌ గూడ్స్‌తో ఈ-కామర్స్‌ మార్కెటింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ జతకలిసింది. కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వినియోగదారులకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను వారి ఇంటికే తీసుకెళ్లేందుకు ఈ రెండు సంస్థలు ఏకమయ్యాయి.

వినియోగదారులు తమకు అవసరమైన నిత్యావసరాలను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఆర్డర్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటికే బెంగళూరులో అందుబాటులో ఉన్నదని, వచ్చే వారం ముంబై, ఢిల్లీలకు విస్తరిస్తామని, క్రమంగా ద్వితీయశ్రేణి నగరాలపై దృష్టిసారిస్తామని చెప్పారు.
 
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అందించే పానీయాలు (టాటా టీ, కాఫీ), ఆహార పదార్థాలు (టాటా సంపన్ సుగంధ ద్రవ్యాలు, పప్పుధాన్యాలు, న్యూట్రీ మిక్స్‌లు) వంటి వివిధ కాంబో ప్యాక్‌లను కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవడానికి ఈ భాగస్వామ్యం వినియోగదారులను అనుమతిస్తుంది.

టాటా కన్స్యూమర్ కంపెనీ పంపిణీదారుల నుండి ఈ ఉత్పత్తులను తీసుకొని, దాని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల నెట్‌వర్క్‌ను ఉపయోగించి వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ పంపిణీ చేస్తుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments