Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరుల ఖాతాలో జమచేస్తే ఏడేళ్ళ జైలుశిక్ష : ఐటీ శాఖ వార్నింగ్

తమ వద్ద ఉన్న పాతనోట్లను ఇతరుల ఖాతాల్లో జమ చేసేవారికి ఆదాయపన్ను శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వారికి గరిష్టంగా ఏడేళ్ళ మేరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. దీంతో నల్లకుబేరుల్లో వ

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (10:07 IST)
తమ వద్ద ఉన్న పాతనోట్లను ఇతరుల ఖాతాల్లో జమ చేసేవారికి ఆదాయపన్ను శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి వారికి గరిష్టంగా ఏడేళ్ళ మేరకు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. దీంతో నల్లకుబేరుల్లో వణుకు మొదలైంది. 
 
అలాగే, ఐటీశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో ఖాతాలో రూ.2.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ న‌గ‌దు ఉంటే ఆ వివరాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న ఖాతాల్లో రూ.50 వేల వ‌ర‌కు జ‌మ‌చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 
 
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఆ నోట్లను మార్చుకునేందుకు న‌కిలీ బాబులు జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను ఉప‌యోగించుకుంటున్నట్టు వ‌స్తున్న వార్తల నేప‌థ్యంలో ఐటీ శాఖ ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈనెల 8వ తేదీ త‌ర్వాత బ్యాంకు ఖాతాల్లో అయిన న‌గ‌దు జ‌మ వివ‌రాల‌ను ఐటీ శాఖ రాబ‌డుతోంది. 
 
కొన్ని ఖాతాల్లో అసాధార‌ణ‌, అనుమానాస్ప‌ద రీతిలో పెద్ద‌మొత్తంలో న‌గ‌దు జ‌మ అవుతున్న‌ట్టు గుర్తించింది. ఈ విష‌య‌మై ఫిర్యాదులు అందుకున్న ఐటీశాఖ అక్ర‌మార్కుల ప‌నిప‌ట్టేందుకు సిద్ధ‌మైంది. ఇత‌రుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments