విజయవాడలో తమ కార్యకలాపాలు ప్రారంభించిన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:14 IST)
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న చిన్న ఫైనాన్స్‌ బ్యాంక్‌లలో ఒకటైన సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌బీ) తమ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కృష్ణలంకలోని బాలాజీనగర్‌లో నేడు తమ మొదటి శాఖను ప్రారంభించింది. ఈ శాఖను లెఫ్టినెంట్‌ కమాండర్‌ బీఎం రవీంద్రనాథ్‌ రెడ్డి (డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్ట్యూటివ్‌ ఆఫీసర్‌, ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డ్‌), శ్రీ వెంకటేశ్వర రెడ్డి (అధ్యక్షులు- హైర్‌ బస్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌) ప్రారంభించారు.

 
ఈ సందర్భంగా సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈవో భాస్కర్‌ బసు మాట్లాడుతూ, ‘‘సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ప్రధానంగా బ్యాంకు కార్యకలాపాలు అందుబాటులో లేని, అతి తక్కువ సేవలు అందుబాటులో కలిగిన వారిని సైతం ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడంపై దృష్టి కేంద్రీకరించింది.

 
తాము ఎక్కడైతే కార్యకలాపాలు నిర్వహించడం లేదో ఆ రాష్ట్రాలలో ఉనికిని విస్తరిస్తున్నాం. ఈ క్రమంలో మా కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా మొదటి శాఖను విజయవాడలోని బాలాజీనగర్‌లో ఏర్పాటుచేశాము. అతి తక్కువ నిర్వహణ వ్యయాలు,  విస్తృత స్థాయి వ్యాపార నమూనాలతో మా వినియోగదారులకు అత్యంత సరసమైన వడ్డీ రేట్లను డిపాజిట్లపై అందిస్తున్నాం’’ అని అన్నారు.

 
ప్రస్తుతం సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలపై 6.25% వడ్డీని అందిస్తుంటే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7% వరకూ అందిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.3% వరకూ వడ్డీ అందిస్తుంది. ప్రతినెలా సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీని క్రెడిట్‌ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments