Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైస్ జెట్ నుంచి ''మెగా మాన్‌సూన్‌ సేల్'': రూ.699కే పలు రూట్ల మధ్య టిక్కెట్లు

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తాము రూ.699కే పలు రూట్ల మధ్య విమాన టికెట్‌లను అందించే అద్భుత ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నిర్ణీత సంఖ్య‌లో మాత్ర‌మే ఉన్న ఈ టికెట్ల‌ను గురువ

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (11:00 IST)
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ‘మెగా మాన్‌సూన్‌ సేల్‌’ పేరుతో తాము రూ.699కే పలు రూట్ల మధ్య విమాన టికెట్‌లను అందించే అద్భుత ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నిర్ణీత సంఖ్య‌లో మాత్ర‌మే ఉన్న ఈ టికెట్ల‌ను గురువారం నుంచి వ‌చ్చేనెల‌ 4 వరకు బుక్ చేసుకోవ‌చ్చ‌ునని తెలిపింది. బుకింగ్‌లు చేసుకున్న ప్రయాణికులు వ‌చ్చేనెల‌ 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది.
 
జమ్ము-శ్రీనగర్‌, గువహటి-అగర్తలా, ఐజ్వాల్‌-గువహటితో పాటు మరికొన్ని మార్గాల్లో ప్ర‌యాణించాల‌నుకుంటున్న ప్రయాణీకుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. బుకింగ్ చేసుకున్న ప్ర‌యాణికుల‌కు మ‌రో ఆఫ‌ర్‌ను కూడా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. వారిలో ప‌లువురిని లక్కీడ్రాలో ఎంపిక చేసి దుబాయ్‌, మాలే, కొలంబో, బ్యాంకాక్‌ వెళ్లేందుకు హాలిడే ప్యాకేజ్‌ను ఆఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లను ఎయిర్ లైన్స్ వెబ్ సైట్లు, మొబైల్ యాప్‌తో పాటు కొన్ని ఆన్ లైన్ పోర్టల్స్ అంటే మేక్‌మైట్రిప్, యాత్ర, స్కైన్‌స్కానర్ వంటి వెబ్ సైట్లలోనూ బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకునే వారి టిక్కెట్లు రీఫండబుల్ అంటూ స్పైస్ జెట్ తెలిసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments