Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ సీజన్‌లో కొత్త రైల్ రిజర్వేషన్ నిబంధనలు.. ఏంటవి?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:43 IST)
దేశంలో పండుగ సీజన్ మొదలైంది. దీంతో రైల్వే శాఖ కూడా పండుగ సీజన్‌లో ఏర్పడే రద్దీని నివారించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇందుకోసం రద్దీ ఉన్న మార్గాలను గుర్తిస్తోంది. అయితే, ఈ పండుగ సీజన్‌లో రిజర్వేషన్ నిబంధనల్లో రైల్వే శాఖ కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఈ నిబంధనలు గత శనివారం అంటే ఈ నెల పదో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపనుంది. ఈ సందర్భంగా టికెట్ బుకింగ్, రిజర్వేషన్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ఇన్నాళ్లూ కేవలం ఒకే రిజర్వేషన్ చార్టును మాత్రమే ప్రిపేర్ చేసేది. 
 
* ఇకపై గతంలోలాగా రెండో రిజర్వేషన్ చార్టును ప్రిపేర్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైలు బయల్దేరడానికి ముందు 30 నుంచి 5 నిమిషాలలోపు రెండో రిజర్వేషన్ చార్ట్‌ను ప్రిపేర్ చేయనుంది. 
 
* పాత పద్ధతి ప్రకారం రెండో రిజర్వేషన్ చార్టును అక్టోబరు 10 నుంచి ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. రెండో చార్ట్ ప్రిపేర్ చేయడానికి ముందు ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేయొచ్చు. రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతి ప్రకారమే 30 నిమిషాల ముందు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది.
 
* గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు గంటల ముందు చార్టును ప్రిపేర్ చేసేది. ఈ పద్ధతి కొన్ని నెలల పాటు ఇలాగే ఉంది. ఇక మొదటి రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి కనీసం నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. 
 
* మొదటి చార్టులో ఖాళీగా ఉన్న బెర్తుల్ని ప్రయాణికులు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యేలోగా ఆన్‌లైన్‌లో, రిజర్వేషన్ కౌంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
 
* ఇక అప్పటికే బుక్ చేసిన రైలు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉన్న రీఫండ్ రూల్స్ వారికి వర్తిస్తాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయిన విషయం తెల్సిందే. 
 
* అయితే, మే ఒకటో తేదీన శ్రామిక్ రైళ్లను నడపడం ద్వారా రైల్వే సేవల్ని పునరుద్ధరించారు. అప్పట్నుంచి దశలవారీగా రైళ్ల సంఖ్యను రైల్వే శాఖ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో పండుగ సీజన్‌లో ప్రస్తుతం నడుస్తున్న రైళ్ళకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments