Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరెన్సీ కరువు... చెన్నైకు ఒకటే ఫోన్లు

దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ క

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (11:21 IST)
దేశంలో పెద్ద నోట్ల సమయంలో కరెన్సీ కష్టాలు చవిచూశాం. కానీ, పెద్ద నోట్లను రద్దు చేసి ఓ యేడాది పూర్తయినా అనేక ప్రాంతాల్లో మాత్రం కరెన్సీ కష్టాలు మాత్రం పోలేదు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెన్సీ కష్టాలు మరింత తారాస్థాయిలో ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులకు డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రజలు చెన్నై వాసులకు పదేపదే ఫోన్లు చేస్తున్నారు. ఎవరైనా చెన్నై నుంచి వస్తున్నారంటే చాలు, ఏటీఎంలలో కరెన్సీ నోట్లు తీసుకురావాలంటూ ఏపీ ప్రజలు బతిమలాడుతున్నారు. 
 
తమకు తెలిసిన వారు ఎవరైనా చెన్నై నుంచి తిరిగి ఏపీకి వస్తున్నారంటే "ఇక్కడ కరెన్సీకి కరువు వచ్చింది. కాస్త కరెన్సీ నోట్లు ఉంటే తీసుకు రండి. కావాలంటే నాలుగు రూపాయలు ఎక్కువైనా తీసుకోండి ప్లీజ్‌" అంటూ ప్రాధేయపడుతున్నారు. 
 
ఏపీలో ఇప్పుడు ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు దొరకడం లేదు. దీంతో చెన్నై నుంచి వస్తున్న వారికి డబ్బు తెమ్మని ఏపీ నుంచి ఒకటే ఫోన్లు వెళ్తున్నాయట. ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments