Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐ ఖాతాదారులకు శుభవార్త.. రద్దు ఛార్జీలకు స్వస్తి

ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతా కలిగిన వారు కనీస నిల్వ రూ.5 వేలు ఉంచాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (06:54 IST)
ఇటీవలికాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన భారతీయ స్టేట్ బ్యాంకు పేరెత్తితే ఖాతాదారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు ఖాతా కలిగిన వారు కనీస నిల్వ రూ.5 వేలు ఉంచాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పైనా పరిమితులు విధించింది. ఈ పరిమితులు దాటితే అదనపు చార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. దీంతో ఎస్.బి.ఐ పేరెత్తితే ఖాతాదారులు బెంబేలెత్తిపోయారు. 
 
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తన ఖాతాదారులకు ఎస్.బి.ఐ శుభవార్తలు చెపుతూ వస్తోంది. కనీస నిల్వ మొత్తాన్ని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా తగ్గించింది. తాజాగా మరో మంచివార్త చెప్పింది. కనీసం ఒక ఏడాది నిండిన పొదుపు ఖాతాలను రద్దు చేసుకోవాలంటే ఎటువంటి ఛార్జీలను చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది. ఈ ఆదేశాలు అక్టోబరు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. 
 
గతంలో సేవింగ్స్ అకౌంట్స్‌ను రద్దు చేసుకోవాలంటే రూ.500, అదనంగా జీఎస్‌టీ వసూలు చేసేవారు. ఖాతాను ప్రారంభించిననాటి నుంచి 14 రోజుల్లోగా రద్దు చేసుకునేవారికి ఈ ఛార్జీలను వసూలు చేసేవారు కాదు. మరణించిన డిపాజిటర్ల ఖాతాలను రద్దు చేసుకోవడానికి విధించే ఛార్జీలను కూడా రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. 
 
అదేవిధంగా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్ నిర్వహించే రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను రద్దు చేసుకోవాలన్నా క్లోజర్ ఛార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. అయితే, ఖాతాను ప్రారంభించిననాటి నుంచి 14 రోజులు గడచిన తర్వాత, ఒక ఏడాది పూర్తికాకుండా రద్దు చేసుకోవాలంటే గతంలో మాదిరిగానే రూ.500తోపాటు జీఎస్‌టీని చెల్లించవలసి ఉంటుందని వివరించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments